విజయ్ దేవరకొండ, క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ల కాంబినేషన్ లో మరో మూవీ రాబోతోంది. ఇప్పటికే లైగర్ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, మరో క్రేజీ మూవీని అనౌన్స్ చేశారు. తమ తదుపరి ప్రాజెక్టు జనగణమన అని ప్రకటించారు. యాక్షన్ డ్రామా అయిన ఈమూవీ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ గా విజయ్‌ని ఎన్నడూ చూడని పాత్రలో చూడొచ్చు.
పూరి జగన్నాధ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ వహిస్తుండగా, ఛార్మీ కౌర్, వంశీ పైడిపల్లి పూరి జగన్నాధ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరో మాస్ ఎంటర్‌టైనర్ గా ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కబోతోంది. దర్శకుడు పూరి జగన్నాధ్ మాట్లాడుతూ “మా తదుపరి ప్రాజెక్ట్ ‘జెజిఎమ్’ అనౌన్స్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. విజయ్‌తో మళ్లీ కలిసి పనిచేయడం చాలా గొప్పగా అనిపిస్తుంది అని అన్నారు. JGM ఒక బలమైన కథనం. ఇది అల్టిమేట్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ మేరకు ఈ ‘జనగణమన’ చిత్రం పోస్టర్, విడుదల తేదీని ప్రకటించారు. ఈ పోస్టర్ లాంచ్‌ను మంగళవారం (మార్చి 29) ముంబైలో గ్రాండ్‌గా జరిగింది.