Kushi Second Song: వావ్ వాట్ ఏ లవ్ లీ సాంగ్.. ఖుషి నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్!

కొన్ని సినిమాలు విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతుంటాయి.

Published By: HashtagU Telugu Desk
Kushi

Kushi

కొన్ని సినిమాలు విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతుంటాయి. ఫస్ట్ లుక్ నుంచి పాటల వరకు అన్నింటా ఆకట్టుకుంటుంటాయి. అలాంటి వాటిలో ఖుషి సినిమా ఒకటి. సినిమాలో పాటలు హిట్ అయితే.. ఆ సినిమా సగం హిట్ అయ్యినట్టేనని భావిస్తారు మ్యూజిక్ లవర్స్. ఇప్పటికే మొదటి పాట ఆకట్టుకోగా, రెండో పాట కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) కలిసి నటిస్తున్న లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఖుషి’. లవ్ స్టోరీస్ ని బాగా తెరకెక్కించే శివ నిర్వాణ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ‘నా రోజా నువ్వే’ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు సెట్ చేసింది. తాజాగా ఇప్పుడు మరో సాంగ్ ని రిలీజ్ చేశారు. మణిరత్నం సినిమా టైటిల్స్ తో మొదటి పాటకి లిరిక్స్ రాసిన శివ నిర్వాణ.. ఆరాధ్య పాటకి కూడా సాహిత్యం అందిస్తున్నాడు. ఈ లిరిక్స్ కూడా అందర్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ఈ పాటని సిద్ శ్రీరామ్, చిన్మయి పాటని పాడారు. ఆరాధ్య అంటూ సాగే ఈ పాట మ్యూజిక్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వాచ్ చేయండి మరి.

మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ మొదటిసారి ఈ మూవికి వర్క్ చేస్తుండటం అంచనాలను పెంచింది. లవ్ లీ మ్యూజిక్ ఇవ్వడంలో వహాబ్ కు మంచి పేరుంది. ఇప్పటికే ఖుషి సినిమాలోని నా రోజా నువ్వే పాట అందర్నీ ఆకట్టుకొని యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ఆరాధ్య సాంగ్ ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుందో వేచిచూడాల్సిందే.

  Last Updated: 12 Jul 2023, 06:10 PM IST