Vijay Devarakonda ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. కల్కి సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా లోక నాయకుడు కమల్ హాసన్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. సినిమా రెండు భాగాలుగా ప్లాన్ చేస్తుండగా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేందుకు అదిరిపోయే కంటెంట్ ప్లాన్ చేస్తున్నారట నాగ్ అశ్విన్.
We’re now on WhatsApp : Click to Join
ఈ క్రమంలో సినిమాలో ప్రభాస్, కమల్ హాసన్ మాత్రమే కాదు మరో ఇద్దరు హీరోలు కూడా కనిపిస్తారని టాక్. ప్రభాస్ ఉండగా మరో హీరో సరే కమల్ హాసన్ (Kamal Hassan) ఉన్నాడుగా మళ్లీ ఇంకో ఇద్దరు హీరోలా ఎందుకు అనుకోవచ్చు. సినిమాలో సరైన టైం లో కనిపించే చిన్న పాత్ర అయినా అది ఒక హీరో చేస్తే ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. ఆ కారణంగానే నాగ్ అశ్విన్ కల్కిలో ఇద్దరు హీరోలని తీసుకున్నాడట.
అందులో ఒకరు రౌడీ హీరో ది దేవరకొండ విజయ్ కాగా మరొకరు దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) అని తెలుస్తుంది. ఇద్దరు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో సినిమాలు చేసినవారే. అందుకే ఆ చనువుతోనే కల్కిలో చేస్తున్నారని తెలుస్తుంది. నాగ్ అశ్విన్ నిర్మించిన జాతిరత్నాలు సినిమాలో కూడా విజయ్ దేవరకొండ నటించాడు. ఇప్పుడు కల్కిలో కూడా భాగం అవుతున్నాడు.
కల్కి సినిమా మొదటి పార్ట్ మే 9న రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపిస్తారని తెలుస్తుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న కల్కి సినిమా వెండితెర మీద అద్భుతాలు చేస్తుందని అంటున్నారు. నాగ్ అశ్విన్ సినిమా మీద అంచనాలు పెంచేలా త్వరలో ఒక టీజర్ రెడీ చేస్తున్నారట. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో సలార్ 1 తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఈ సమ్మర్ లో కల్కితో వస్తున్నాడు. దీని తర్వాత రాజా సాబ్ తో రానున్నాడు. ప్రభాస్ కల్కి రెండో పార్ట్ కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తారట. సలార్ 2 కూడా 2025 చివర్లో లేదా 2026 సమ్మర్ రిలీజ్ ఉంటుందని టాక్.
Also Read : Nani Repeates Dasara Combination : దసరా కాంబోనే నెక్స్ట్.. మరో బ్లాక్ బస్టర్ ఫిక్స్..!
అయితే ఈ ఇయర్ కల్కితో పాటు రాజా సాబ్ రెండు సినిమాలతో రెబాల్ స్టార్ ఫ్యాన్స్ ని ఖుషి చేయనున్నాడు. ప్రభాస్ ఇలా వరుస సినిమాలు రిలీజ్ చేయడం రెబల్ ఫ్యాన్స్ కే కాదు సినీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.