Vijay Antony: వివాదంలో హీరో విజయ్ ఆంటోనీ.. మండిపడుతున్న క్రైస్తవులు?

  • Written By:
  • Publish Date - March 21, 2024 / 09:30 AM IST

తెలుగు ప్రేక్షకులకు నటుడు విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ ఆంటోనీ పేరు వినగానే ముందుగా గుర్తుకువచ్చే సినిమా బిచ్చగాడు. ఈ సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు విజయ్. విజయ్ ప్రస్తుతం సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్లను ఎంచుకుంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇది ఇలా ఉంటే విజయ్ మొదటి సారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటిస్తున్న సినిమా లవ్ గురు. ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది.

లవ్ గురు సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11న విడుదల చేయబోతున్నారు. తమిళంలో ఈ చిత్రం రోమియోగా రిలీజ్ అవుతోంది. అయితే ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్ బాగా వైరల్ అయింది. ఈ పోస్టర్ లో మృణాళిని రవి శోభనం గదిలో మద్యం పోస్తూ బోల్డ్ గా కనిపించింది. దీనితో బాగా చర్చ జరిగింది. పెళ్లి కూతురు శోభనం గదిలో మద్యం సేవించడం ఏంటి అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు. దీనికి వివరణ ఇచ్చే క్రమంలో విజయ్ ఆంటోని చిక్కుల్లో పడ్డాడు.

మద్యం అనే దానిని స్త్రీలకు పురుషులకు వేరుగా చేసి చూడకూడదు అని విజయ్ ఆంటోని తెలిపాడు. మద్యం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. మద్యం సేవించడం స్త్రీలకు పురుషుల సాధారణమైన విషయం. మద్యం సేవించడం పురాతన కాలం నుంచి వస్తోంది. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు వివిధ బ్రాండ్స్ పేరుతో అమ్ముతున్నాయి. క్రీస్తు కూడా ద్రాక్ష రసాన్ని మద్యంగా సేవించినట్లు ఉందని విజయ్ ఆంటోని తెలిపాడు. క్రీస్తుపై విజయ్ చేసిన ఈ కామెంట్స్ క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. దీనితో వెంటనే క్రైస్తవులు విజయ్ ఆంటోని కామెంట్స్ కి రియాక్ట్ అవుతున్నారు. విజయ్ ఆంటోని క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. క్రీస్తు మద్యం సేవించినట్లు ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారు. తన కామెంట్స్ వివాదంగా మారడంతో విజయ్ కూడా స్పందించాడు. తన మాటలని తప్పుగా అర్థం చేసుకోవద్దని.. ద్రాక్ష రసం రెండువేల ఏళ్ల క్రితమే దేవాలయాల్లో చర్చిలలో ఉపయోగించేవారు. ఆ ఉద్దేశంతోనే అలా అన్నాను. తన మాటలు బాధించి ఉంటే క్షమించాలని కోరాడు విజయ్ అంటోని..