Site icon HashtagU Telugu

Love Guru: విజయ్ ఆంటోనీ “లవ్ గురు” రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే

Love Guru

Love Guru

Love Guru: హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “లవ్ గురు”. ఆయన తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటిస్తున్న చిత్రమిది. “లవ్ గురు” సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మించారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా “లవ్ గురు” సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11న విడుదల చేయబోతున్నారు. ఇవాళ “లవ్ గురు” సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

“లవ్ గురు” ట్రైలర్ ఎలా ఉందో చూస్తే.. తండ్రి పోరు పడలేక పెళ్లికి ఓకే చెప్తుంది ప్రియా అనే అమ్మాయి. ఆమెకు ఈ పెళ్లి ఇష్టం ఉండదు. పెళ్లి చూపుల టైమ్ లో కాబోయో భర్తకు కొన్ని కండీషన్స్ పెడుతుంది. అమ్మాయిని ఇష్టపడిన ఆ అబ్బాయి ఆమె చెప్పిన కండీషన్స్ అన్నింటికీ తలూపుతాడు. భార్యను వన్ సైడ్ గా లవ్ చేస్తాడు. షరతులన్నీ ఒప్పుకుంటాడు గానీ పెళ్లయ్యాక వాటిలో ఉన్న ఇబ్బందులు అర్థమవుతుంటాయి. పెళ్లయ్యాక ఎదురైన ఈ సమస్యల నుంచి హీరో ఎలా బయటపడ్డాడు. భార్యను ప్రేమించడం ఎలాగో తెలుసుకున్నాడా లేదా అనే అంశాలతో ట్రైలర్ ఫన్, ఎంటర్ టైనింగ్ గా చూపించారు. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చేలా “లవ్ గురు” సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

Exit mobile version