తమిళ్(Tamil) హీరో విజయ్ ఆంటోని(Vijay Antony) 2016లో బిచ్చగాడు(Bichagadu) సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించాడు. తమిళ్ లో రిలీజయిన పిచైక్కారన్ సినిమాని తెలుగులో బిచ్చగాడు గా రిలీజ్ చేశారు. చాలా తక్కువ బడ్జెట్ తో డబ్బింగ్ రైట్స్ తీసుకొని తెలుగులో రిలీజ్ చేయగా ఈ సినిమా తెలుగులో భారీ విజయం సాధించింది. తమిళ్ లో కంటే కూడా తెలుగులో పెద్ద హిట్ కొట్టి కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి.
అయితే బిచ్చగాడు సినిమాకు పార్ట్ 2 ఉంటుందని చాలా రోజులుగా చెప్తున్నాడు విజయ్ ఆంటోని. ఇటీవలే ఈ సినిమా గురించి ప్రకటించి ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా బిచ్చగాడు 2 ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత విజయ్ ఇందులో కూడా రెండు వేరియేషన్స్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు ఒక బ్యాక్ స్టోరీ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం బిచ్చగాడు 2 ట్రైలర్ వైరల్ గా మారింది. మే 19న ఈ సినిమాను తెలుగు, తమిళ్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. బిచ్చగాడు 2 కి విజయ్ ఆంటోనినే డైరెక్షన్ చేయడం గమనార్హం. తన భార్య ఫాతిమా విజయ్ ఆంటోనీ ఈ సినిమాని నిర్మిస్తోంది. ట్రైలర్ తో బిచ్చగాడు 2 పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి బిచ్చగాడు 2 సినిమా ఏ రేంజ్ లో విజయం సాధిస్తుందో చూడాలి.
Also Read : Akkineni Amala: అఖిల్ ‘ఏజెంట్’ పై దారుణంగా ట్రోలింగ్.. తల్లి అమల రియాక్షన్ ఇదే!