Site icon HashtagU Telugu

Vidya Balan : ఐశ్వర్యరాయ్‌ చేయాల్సిన హిట్ మూవీ.. కానీ 60 ఆడిషన్స్‌ తర్వాత విద్యా బాలన్‌ ఎంట్రీ.. ఏ మూవీ తెలుసా..?

Vidya Balan replaced Aishwarya Rai place in superhit Parineeta Movie

Vidya Balan replaced Aishwarya Rai place in superhit Parineeta Movie

ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai Bachchan) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ టు నార్త్ పలు సూపర్ హిట్టు సినిమాల్లో నటించే ఆడియన్స్ ని తన అందాలతోనే కాకుండా నటనతో కూడా ఆకర్షించింది. అయితే 2005 లో ఐశ్వర్య చేయాల్సిన ఒక సూపర్ హిట్ మూవీ.. మరో భామ విద్యా బాలన్‌(Vidya Balan) చేయాల్సి వచ్చింది. సినిమాకే బలమైన పాత్ర కాబట్టి చిత్ర నిర్మాత ఐశ్వర్య అయితే ఆ రోల్ కి న్యాయం చేయగలదు అని వాదించాడు.

కానీ దర్శకుడు మాత్రం విద్యా బాలన్‌ మాత్రమే ఆ పాత్రకి కరెక్ట్ అని నమ్మి పట్టుపట్టి సినిమాలోకి తీసుకున్నాడు. కట్ చేస్తే ఆ పాత్రలో విద్యాని తప్ప మరో హీరోయిన్ ని ఉహించుకోలేనంతగా ఒదిగిపోయింది. అంతేకాదు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుని కూడా అందుకుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటని ఆలోచిస్తున్నారా..? ట్రైయాంగులర్ లవ్ స్టోరీ మూవీ ‘పరిణీత’ (Parineeta). సంజయ్ దత్(Sanjay Dutt), సైఫ్ అలీఖాన్(Saif Alikhan), విద్యా బాలన్ మధ్య ముక్కోణపు ప్రేమకథ ఆడియన్స్ మనసు దోచుకొని ఎన్నో అవార్డ్స్ ని అందుకుంది.

ఈ సినిమా కథ మొత్తం హీరోయిన్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. దీంతో ఆ పాత్రకి అనుభవం ఉన్న నటి అయితే బాగా న్యాయం చేయగలదని నిర్మాత విధు వినోద్‌ చోప్రా.. ఐశ్వర్యరాయ్‌ పేరుని చెప్పారు. కానీ దర్శకుడు ప్రదీప్‌ సర్కార్‌ మైండ్ లో అప్పటికే విద్యా బాలన్‌ ఉంది. అయితే ఆమెకు అప్పటికి ఒక సినిమాలో నటించిన అనుభవమే ఉంది. కానీ దర్శకుడు ఆమె అయితేనే బాగుంటుందని ఆమెను లుక్‌ టెస్ట్‌కి పిలిచి.. దాదాపు 60 ఆడిషన్స్‌ చేసి విద్యా నటన పై అందరికి నమ్మకం కలిగిన తరువాత సినిమా మొదలు పెట్టారు.

ఇక ఆ సినిమా సూపర్ హిట్టు అవ్వడం, ఉత్తమ నటిగా అవార్డులను కూడా తెచ్చిపెట్టడంతో విద్యా బాలన్ కి వరుస అవకాశాలు తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాతే విద్యాబాలన్ కి స్టార్ హీరోయిన్ రేంజ్ వచ్చింది.

 

Also Read : తమిళ ఇండస్ట్రీ ఫై పవన్ చేసిన వ్యాఖ్యలకు నాజర్ క్లారిటీ