సుక్కు బ్రిలియన్స్ పై బన్నీకి అంత నమ్మకం ఉందా?

టాలీవుడ్ తో పాటు స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న మూవీ పుష్ప..ది రైజ్.

  • Written By:
  • Publish Date - November 5, 2021 / 12:46 PM IST

టాలీవుడ్ తో పాటు స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న మూవీ పుష్ప..ది రైజ్. డిసెంబర్ 17న రిలీజవబోతున్న మూవీ గురించి బన్నీ తన మనసులోని మాటలను షేర్ చేసుకున్నాడు. తాజాగా ఓ ఈవెంట్ లో మాట్లాడిన బన్నీ.. ఇందులో సుకుమార్‌ బ్రిలియెన్స్‌ చూస్తారని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఈ ఒక్కమాటతో బన్నీ అభిమానులు పండుగ చేసుకుంటున్నాడు. లెక్కల మాస్టర్ సుకుమార్ మూవీ అంటేనే ఓ రేంజ్ లో ఉంటుందని అనుకుంటున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్.. ఇప్పుడు బన్నీ అదే మాటను చెప్పడంతో వచ్చే నెలలో రాబోయే పాన్-ఇండియా ప్రాజెక్ట్ యొక్క మొదటి భాగం పుష్పపై అంచనాలు పెంచేసుకుంటున్నారు. దీంతో పుష్ప, డైరక్టర్ సుకుమార్‌ చేతిలో రాబోతున్న అద్భుతాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం పెరిగిపోయింది.

 

థియేటర్లకు వెళ్లి తన సినిమా చూడాలని, తాను బాగా చేశానో లేదో రివ్యూ చేసి ఫీడ్‌బ్యాక్ ఇవ్వమని అభిమానులను కోరాడు బన్నీ. ఈ మూవీలో పాటలు విన్నానని చెప్పుకొచ్చిన బన్నీ..సాంగ్స్ అన్నీ బ్లాక్ బస్టర్స్ అని కితాబిచ్చేసాడు. ఇంకో రెండు పాటలు త్వరలోనే రిలీజ్ అవుతాయని అవి కూడా అందరికీ నచ్చుతాయని తాను కచ్చితంగా అనుకుంటున్నానని చెప్పాడు. తాను డిసెంబర్ 17 న పుష్పతో వస్తున్నానని, అక్కడ ఫ్యాన్స్ ను కలుస్తానని .. తగ్గేదే లే” అంటూ ఫైనల్ టచ్ ఇచ్చి అభిమానుల హార్ట్ బీట్ పెంచేశాడు.

Also Read : First Look: “లైగర్” నుంచి మైక్ టైసన్ లుక్ రిలీజ్ 

ఈ సినిమా స్టోరీ అంతా ఆంధ్రప్రదేశ్‌లోని కొండల్లో జరిగిన ఎర్రచందనం దోపిడీ చుట్టూ తిరుగుతుంది. పుష్ప మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్న , విలన్ గా మాలీవుడ్ హార్ట్‌త్రోబ్ ఫహద్ ఫాసిల్‌తో.. బన్నీ మొదటిసారిగా స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నారు. ముత్తంశెట్టి మీడియా సహకారంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యాంక్రోల్ చేసిన పుష్ప మొదటి భాగం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Also Read : గడ్డి కోసుకునే పిల్ల భారతీయ సినిమాల్లో తొలి దళిత నటిగా ఎలా మారింది?