Site icon HashtagU Telugu

Venkatesh Saindhav Worldwide Business : పాతిక కోట్ల టార్గెట్ తో వెంకీ మామా.. సైంధవ్ ఏరియా వైజ్ బిజినెస్ లెక్కలివే..!

Saindhav

Saindhav

Venkatesh Saindhav Worldwide Business విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా సైంధవ్. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ బోయినపల్లి ఈ సినిమా నిర్మించారు. చాలాకాలం తర్వాత వెంకటేష్ నుంచి వస్తున్న యాక్షన్ మూవీగా సైంధవ్ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాలో వెంకటేష్ తో పాటుగా శ్రద్ధ శ్రీనాథ్, ఆండ్రియా, రుహాని శర్మ నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్ సారా కూడా వెంకటేష్ కూతురుగా నటించింది.

We’re now on WhatsApp : Click to Join

సంక్రాంతి కానుకగా వస్తున్న సైంధవ్ సినిమా భారీ హైప్ తెచ్చుకుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా పాతిక కోట్ల బిజినెస్ తో వస్తుంది. నైజాం 7 కోట్ల బిజినెస్ చేసిన సైంధవ్.. ఆంధ్రాలో 9 కోట్లు చేసింది. ఏపీ తెలంగాణా కలిపి 19 కోట్ల బిజినెస్ చేసింది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 2 కోట్లు చేయగా ఓవర్సీస్ 4 కోట్ల దాకా బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది. వరల్డ్ వైడ్ గా సైంధవ్ సినిమా 25 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ అనిపించుకోవాలంటే 26 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది.

పోటీగా మహేష్ గుంటూరు కారం ఉన్నా కూడా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో వెంకటేష్ సైంధవ్ సినిమా వస్తుంది. అయితే వెంకటేష్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే పాతిక కోట్లు పెద్ద మ్యాటర్ ఏం కాదు. దగ్గుబాటి ఫ్యాన్స్ అంతా కూడా వెంకటేష్ ని మాస్ యాంగిల్ లో చూడాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. శైలేష్ కొలను సైంధవ్ గా వెంకటేష్ ని ఇదివరకు చూడని విధంగా ఫుల్ యాక్షన్ మోడ్ లో చూపిస్తున్నాడు.

వెంకటేష్ సైంధవ్ సినిమా ప్రచార చిత్రాలు సినిమాపై సూపర్ క్రేజ్ తెచ్చాయి. సినిమా ట్రైలర్ లో వెంకటేష్ యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. అయితే ఆడియన్స్ కంటెంట్ కి కనెక్ట్ అయితే మాత్రం సైంధవ్ సినిమా కచ్చితంగా పాజిటివ్ టాక్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది.

Also Read : Na Samiranga Worldwide Business : కింగ్ నాగార్జున నా సామిరంగ బిజినెస్ డీటైల్స్ ఇవే.. హిట్టు కొట్టాలంటే ఎంత తీసుకు రావాలంటే..!

f3 సినిమా తర్వాత వెంకటేష్ చేసిన ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ సైంధవ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. వెంకటేష్ సైంధవ్ సంక్రాంతి విన్నర్ అవ్వాలంటే 26 కోట్ల పైన వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. సంక్రాంతి రేసు లో వెంకటేష్ తో పాటుగా మహేష్, నాగార్జున సినిమాలు వస్తున్నాయి. వీటితో పాటుగా పూర్తిగా కంటెంట్ బెస్ మీద హనుమాన్ సినిమా కూడా వస్తుంది. ఈ సినిమాల మధ్య వెంకటేష్ సైంధవ్ ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.