Katrina : బాలీవుడ్ లో మోగనున్న పెళ్లి బాజాలు.. విక్కీ, కత్రినా మ్యాచ్ ఫిక్స్!

బాలీవుడ్ బ్యూటిపుల్ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ప్రేమలో ఉన్నారని, పెళ్లికూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయమై ఈ జంట ఇప్పటివరకు ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు.

  • Written By:
  • Publish Date - November 20, 2021 / 12:15 PM IST

బాలీవుడ్ బ్యూటిపుల్ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ప్రేమలో ఉన్నారని, పెళ్లికూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయమై ఈ జంట ఇప్పటివరకు ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. మీడియా పలు సందర్భాల్లో ప్రశ్నించిన సైలంట్ గా ఉండిపోయారు. అయితే ఎట్టకేలకు ఈ జంట అధికారికంగా వివాహ ప్రకటన చేయాలని నిర్ణయించుకున్నారని తెలిసి అభిమానులు ఆనందపడిపోతున్నారు. ‘‘విక్కీ కౌశల్‌తో కత్రినా కైఫ్ పెళ్లి బంధాన్ని చూసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. పెళ్లి తేదీ దగ్గరపడుతున్న కొద్దీ పెళ్లిసందడి మొదలవుతోంది. ఇప్పటికే పెళ్లి పనుల్లో నిమగ్నమైన ఈ జంట ఏ నిమిషంలోనైనా బాలీవుడ్ ప్రముఖులకు, నటులకు వెడ్డింగ్స్ కార్డ్స్ పంపే వీలుంది. ఈ జంట తమ వివాహాన్ని అధికారికంగా ప్రకటిస్తారని చెప్పారు. విక్కీ, కత్రినా ఇద్దరూ మీడియాతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అందరితో శుభవార్త పంచుకోవాలని, త్వరలో బహిరంగ ప్రకటన చేయాలని ప్లాన్ చేస్తున్నాం’’ అని సన్నిహితులు పేర్కొంటున్నారు.

ఇండస్ట్రీకి చెందిన వారి స్నేహితుల అందుబాటులో ఉన్న తేదీలతో పెళ్లికి సంబంధించిన గెస్ట్ లిస్ట్ కూడా సిద్ధమవుతోంది. అందులో సహనటులు, నిర్మాతలు, దర్శకుల పేర్లు ఉన్నాయి. ఏక్ థా టైగర్ దర్శకుడు కబీర్ ఖాన్ ఇంట్లో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ హుష్-హుష్ రోకా వేడుకను నిర్వహించారు. కత్రినా, కబీర్ ల మధ్య మంచి సోదరాభావం ఉంది. గతంలో చాలాసార్లు కత్రినా కబీర్ కు రాఖీ కూడా కట్టారు. అందుకే కబీర్ అన్నీతానై వ్యవహరిస్తున్నారు. అయితే షాదీ వార్త మీడియాలో లీక్ కావడం పట్ల అసంతృప్తిగా ఉంది. చివరి నిమిషంలో తమ పెళ్లి వేదికను మార్చే అవకాశం ఉందని కొందరు సన్నిహితులు చెబుతున్నారు!