VI Anand సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద డైరెక్షన్లో రీసెంట్ గా వచ్చిన మూవీ ఊరు పేరు బైరవకోన. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సమర్పణలో హాస్య మూవీస్ రాజేష్ దండా ఈ సినిమాను నిర్మించారు. సందీప్ కిషన్ కి జోడిగా వర్షా బోల్లమ్మ కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు. లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయిన ఈ సినిమా నాలుగు రోజుల్లో 20 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది. నైజాంలో ఈ సినిమా ఐదు కోట్ల క్లాస్ కలెక్ట్ చేసిందని నిర్మాతలు ప్రకటించారు.
విఐ ఆనంద్ తన మొదటి సినిమా టైగర్ నుండి ప్రత్యేకమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. సందీప్ కిషన్ తో రెండో సినిమా కూడా అతను హిట్ అందుకున్నాడు. ఇక ఈ హిట్ జోష్లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ నుండి మరో అనౌన్స్మెంట్ వచ్చింది. విఐ ఆనంద్ డైరెక్షన్లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఒక సినిమా రాబోతుంది. ఆనంద్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ప్రకటించారు నిర్మాత అనిల్ సుంకర.
అయితే ఈ సినిమాలో హీరో ఎవరు మిగతా కాస్ట్ ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. వీఐ ఆనంద్ చాలా రోజుల తర్వాత భైరవకోన సినిమాతో తన మార్క్ హిట్ అందుకున్నాడు. సందీప్ కిషన్ కూడా చాలా రోజుల నుంచి ఈ హిట్టు కోసమే ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ సందీప్ కిషన్ వి ఐ ఆనంద్ కలిసి ఊరు పేరు భైరవకోన పార్ట్ 2 తీస్తారా అని ఆడియన్స్ లో అంచనాలు మొదలయ్యాయి. మరి ఈ సినిమా గురించి అప్డేట్ త్వరలో తెలుస్తుంది.
Also Read : Prabhas Raja Saab : రాజా సాబ్ సెకండ్ హాఫ్.. రెబల్ ఫ్యాన్స్ కి రచ్చ రంబోలానే..!