Site icon HashtagU Telugu

Vettaiyan Collections : ‘వేట్టయాన్’ డే 1 కలెక్షన్లు

Vettaiyan

Vettaiyan

వరుస సూపర్ హిట్ల తో యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) తాజాగా వేట్టయాన్ (vettaiyan) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘జైభీమ్’ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ (T. J. Gnanavel) దర్శకత్వం వహించగా..లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ (Lyca Productions) భారీ వ్యయంతో నిర్మించింది. అమితాబ్ బ‌చ్చ‌న్‌, మంజు వారియ‌ర్‌, ఫాహ‌ద్ ఫాజిల్‌, రానా ద‌గ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్‌, దుషారా విజ‌య‌న్ త‌దిత‌రులు కీలక పాత్రలో కనిపించారు.

పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డే 1 వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. వరల్డ్​వైడ్​గా ఈ సినిమా దాదాపు రూ. 65 కోట్ల కలెక్షన్​ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియా లోనే రూ.30 కోట్ల వసూళ్లు సాధించిందని, అత్యధికంగా తమిళ్​లో రూ.26 కోట్లు వసూల్ చేయగా, తెలుగులో రూ. 3.2 కోట్లు, హిందీలో రూ.60 లక్షల దాకా కలెక్షన్ చేసిందని అంటున్నారు. ఇక 2024 కోలీవుడ్ ఇండస్ట్రీలో వేట్టయాన్ ఓపెనింగ్ వసూళ్లలో రెండో స్థానం దక్కించుకోవడం విశేషం.

ఈ ఏడాది తమిళ్ బాక్సాఫీస్ వద్ద విజయ్ ‘గోట్’ (GOAT) అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు సాధించింది. ఈ సిని​మా తొలిరోజు తమిళ్ వెర్షన్ రూ.38 కోట్ల దాకా వసూల్ చేయగా.. వేట్టయాన్ తమిళ్ వెర్షన్​లో రూ.26 కోట్లు కలెక్షన్ సాధించింది.

Read Also : Israeli : సెంట్రల్​ బీరుట్​పై ఇజ్రాయెల్ దాడి – 22 మంది మృతి