Site icon HashtagU Telugu

RGV : 36 ఏళ్ల తర్వాత సుష్మకు క్షమాపణలు చెప్పిన వర్మ..ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?

Rgv Sushma

Rgv Sushma

తెలుగు సినిమా చరిత్రలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన నాగార్జున నటించిన ‘శివ’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన రామ్ గోపాల్ వర్మ, ఆ చిత్రం విడుదలై 36 ఏళ్లు అయిన తర్వాత ఒక చిన్నారిపై తీసిన రిస్కీ సన్నివేశానికి క్షమాపణ తెలిపారు. సినిమాలో సైకిల్ చేజ్ సీన్లో నటించిన బాలనటి సుష్మకు క్షమాపణ చెబుతూ వర్మ సోషల్ మీడియాలో భావోద్వేగపూర్వకంగా స్పందించారు. “శివ సినిమాలో నాగార్జున సైకిల్ నడుపుతుండగా భయంతో బార్‌పై కూర్చున్న ఆ చిన్నారి ఇప్పుడు అమెరికాలో కృత్రిమ మేధస్సు (AI), కాగ్నిటివ్ సైన్స్‌పై పరిశోధన చేస్తున్న సుష్మ. ఆ సీన్‌లో ఆమెను ప్రమాదకర పరిస్థితుల్లో చిత్రీకరించినందుకు నేడు ఆలోచిస్తే విచారంగా ఉంది” అని పేర్కొన్నారు.

Gold Price Today: బంగారం తగ్గింది.. సిల్వర్ రేట్ పెరిగింది

వర్మ ట్వీట్‌కు స్పందించిన సుష్మ.. “ధన్యవాదాలు సర్! ‘శివ’ సినిమాలో భాగమై ఉండటం గర్వంగా ఉంది. ఆ అనుభవం నా చిన్ననాటి గుర్తుల్లో మిగిలిపోయింది. అద్భుతమైన చిత్రంలో నేను చిన్న పాత్ర అయినా పోషించగలిగినందుకు సంతోషం. మీకు నాగార్జునగారికి ‘శివ 4K రీ–రిలీజ్’ విజయవంతం కావాలని ఆశిస్తున్నాను” అని రాసింది. ఈ స్పందనకు ప్రతిస్పందిస్తూ రామ్ గోపాల్ వర్మ మళ్లీ క్షమాపణ తెలిపారు. “ఆ సమయంలో నా దర్శకత్వ ఉత్సాహం, సినిమా మీద ఉన్న ప్యాషన్ కారణంగా ఒక చిన్నారి అయిన నిన్ను అలా రిస్కీ సన్నివేశంలో పాల్గొనమన్నాను. ఇప్పుడు ఆలోచిస్తే అది నీకు మానసిక ఒత్తిడిగా మారి ఉండొచ్చు. దానికి హృదయపూర్వక క్షమాపణలు” అని పేర్కొన్నారు.

1989లో విడుదలైన ‘శివ’ తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త దిశను చూపిన చిత్రంగా నిలిచింది. నాగార్జున–అమల జంటగా నటించిన ఈ చిత్రం కాలేజీ రాజకీయాలు, సామాజిక అన్యాయం, యువతలోని ఆవేశాన్ని ప్రతిబింబించింది. ముఖ్యంగా సైకిల్ చేజ్ సీన్ అప్పట్లో యాక్షన్ సినిమాల‌కు కొత్త స్థాయిని తెచ్చింది. అదే సన్నివేశం తమిళంలో రీమేక్ అయిన ‘ఉధ్యమ్’ చిత్రంలో కూడా హైలైట్ అయింది. ఇప్పుడు నవంబర్ 14 న రీ రిలీజ్ అవుతుంది.

Exit mobile version