Venu Yellamma జబర్దస్త్ లో కామెడీ చేస్తూ కనిపించిన వేణు బలగం లాంటి అద్భుతమైన సినిమా చేస్తాడని ఊహించలేదు. బలగం సినిమా చిన్న బడ్జెట్ తో తెరకెక్కినా సరే పెద్ద సినిమా రేంజ్ ఇంపాక్ట్ చూపించింది. బలగం తర్వాత వేణు ఏ సినిమా చేస్తాడన్న ఆసక్తి మొదలైంది. ఐతే బలగం తర్వాత వేణు ఎల్లమ్మ అనే టైటిల్ తో మరో ఎమోషనల్ మూవీతో వస్తున్నాడని తెలుస్తుంది.
ముందు ఈ సినిమాలో నానిని హీరోగా అనుకోగా ఎందుకో కుదరలేదు. నాని తర్వాత నితిన్ కూడా ఎల్లమ్మలో హీరోగా చేస్తాడని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు నాని, నితిన్ (Nitin) కాదు ఫైనల్ గా తేజా సజ్జాని ఈ సినిమాలో హీరోగా తీసుకున్నారని తెలుస్తుంది. ఈమధ్యనే తేజా సజ్జ (Teja Sajja)కి వేణు కథ చెప్పడం ఆయన పాజిటివ్ గా స్పందించడం జరిగిందట.
హనుమాన్ తో పాన్ ఇండియా హిట్..
వేణు (Venu) బలగం తర్వాత తేజా సజ్జాతో ఎల్లమ్మ (Yellamma) సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబందించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రానుంది. హనుమాన్ తో పాన్ ఇండియా హిట్ కొట్టిన తేజా సజ్జ ప్రస్తుతం మిరాయ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది. ఇక ఇప్పుడు ఎల్లమ్మని ఓకే చేసి మరో క్రేజీ ప్రాజెక్ట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.
వేణు ఎల్లమ్మ కథ ఎలా ఉంటుంది. తేజా సజ్జకి ఈ సినిమా ఎంత ప్లస్ అవుతుంది అన్నది చూడాలి. మిరాయ్, ఎల్లమ్మ తేజా ప్లానింగ్ చూసి కుర్ర హీరోలంతా షాక్ అవుతున్నారని చెప్పొచ్చు.
Also Read : Virat Kohli: విరాట్ కోహ్లీ గురించి 5 విషయాలు మీకు తెలుసా?