Site icon HashtagU Telugu

Venu Thottempudi : ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి హీరో.. అతిథి అంటూనే భయపెట్టడానికి రెడీ అయ్యాడు..

Venu Thottempudi entry in Web Series with Athidhi streaming soon in DisneyPlus HotStar

Venu Thottempudi entry in Web Series with Athidhi streaming soon in DisneyPlus HotStar

వేణు తొట్టెంపూడి(Venu Thottempudi).. ఒకప్పుడు తెలుగులో స్వయంవరం, చిరునవ్వుతో.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా, ఆ తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. అనంతరం సినిమాలకు దూరమైన వేణు తొట్టెంపూడి ఇటీవల కొన్నాళ్ల క్రితం రవితేజ(Raviteja) రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో ఓ పాత్ర చేశాడు. ఆ సినిమా ప్రమోషన్స్ లో ఇకపై మంచి కథలు వస్తే చేస్తాను అని ప్రకటించాడు.

ఇప్పుడు వేణు తొట్టెంపూడి డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాడు. వెబ్ సిరీస్(Web Series) తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. వేణు తొట్టెంపూడి ముఖ్య పాత్రలో తెరకెక్కిన “అతిథి”(Athidhi) ప్రముఖ ఓటీటీ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో రాబోతోంది. “అతిథి” వెబ్ సిరీస్ ను రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దర్శకుడు భరత్ వైజీ రూపొందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇవాళ “అతిథి” వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే…ఒంటరిగా పెద్ద భవంతిలో ఉంటున్న వేణుకు దెయ్యాలంటే నమ్మకం ఉండదు. ఎక్కడో ఒక ఆడది దెయ్యంగా మారిందని, అమ్మాయిలందరూ దెయ్యలంటే ఎలా అని అడుగుతాడు. మీ ఇంట్లో ఉన్నది మనిషి కాదు దెయ్యం అని తన మిత్రుడు చెప్పినా నమ్మడు. కానీ ఆ అమ్మాయి వింతగా ప్రవర్తిస్తుంటుంది. ఇంతకీ ఆమె ఎవరు?, మనిషా, దెయ్యామా? అనేది సిరీస్ లో చూడాలి. మేకింగ్ క్వాలిటీ, యాక్టర్స్ పర్ ఫార్మెన్స్, ట్రైలర్ లో ట్విస్ట్ లు ఆకట్టుకునేలా ఉన్నాయి. కొన్ని కథలు మొదలుపెట్టడం సులువు, ముగించడం కష్టం, కథలకు ముగింపు ఇద్దామా అనే డైలాగ్స్ “అతిథి” పై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 19 నుంచి “అతిథి” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ నుంచి వచ్చిన సేవ్ ది టైగర్స్, సైతాన్, దయ వంటి సిరీస్ లు సూపర్ హిట్స్ అయ్యాయి. ఈ నేపథ్యంలో “అతిథి”పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

Also Read : Salaar Movie: సలార్ కు గ్రాఫిక్స్ దెబ్బ.. రిలీజ్ పై నో క్లారిటీ!