Site icon HashtagU Telugu

Venu Thottempudi : వేణు ఆ సూపర్ హిట్ సినిమాలను వదిలేసుకున్నాడట.. రీ ఎంట్రీలో మాత్రం..

Venu Thottempudi Entry in OTT with Athidi Web Series Spoke about his past movies in Promotions

Venu Thottempudi Entry in OTT with Athidi Web Series Spoke about his past movies in Promotions

ఒకప్పుడు చిరునవ్వుతో, స్వయంవరం, హనుమాన్ జంక్షన్, చెప్పవే చిరుగాలి, కళ్యాణ్ రాముడు.. లాంటి సూపర్ హిట్ సినిమాలతో మెప్పించిన వేణు(Venu Thottempudi) ఇటీవల రామారావు ఆన్ డ్యూటీ(Ramarao On Duty) సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అతిధి(Athidhi) అనే వెబ్ సిరీస్(Web Series) తో ఓటీటీలోకి(OTT) కూడా ఎంట్రీ ఇచ్చారు వేణు.

వేణు తొట్టెంపూడి, అవంతిక మిశ్రా లీడ్ రోల్ లో నటించిన వెబ్ సిరీస్ “అతిథి”. ఈ వెబ్ సిరీస్ ను రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దర్శకుడు భరత్ వైజీ రూపొందించారు. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు షో రన్నర్ గా వ్యవహరించారు. డిస్నీప్లస్ హాట్‌స్టార్(Disney Plus Hotstar) లో నేటి నుంచి “అతిథి” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

తాజాగా ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వగా అప్పటి సినిమాల గురించి, రాబోయే సినిమాల గురించి కూడా మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వేణు.

వేణు మాట్లాడుతూ.. నాగార్జున గారి అన్నమయ్య, చిరంజీవి గారి కొన్ని సినిమాలు చూసినప్పుడు ఇలాంటి సబ్జెక్ట్ మనం తప్పకుండా చేయాలని అనిపిస్తుంటుంది. అతడు సినిమాలో సోనూసూద్ క్యారెక్టర్ లో నేనే నటించాలి. అయితే వేరియస్ రీజన్స్ వల్ల ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయాను. అలాగే దేశముదురు సినిమా కూడా నేనే చేయాలి కానీ చేయలేకపోయాను. అయితే కొన్ని ప్రాజెక్ట్స్ నా కెరీర్ లో మిస్ అయినందుకు ఏమీ బాధపడటం లేదు. ఇదొక సముద్రం.. ఒక్క ఆలా వచ్చి ఆగిపోదు, అలలు వస్తుంటాయి, కొన్నిసార్లు సునామీలు కూడా వస్తాయి. ప్రస్తుతం ఛాయ్ బిస్కెట్ వాళ్లకు ఓ ప్రాజెక్ట్ చేస్తున్నా. సూర్య అని కొత్త దర్శకుడు, అందులో బ్లైండ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను. అది చాలా మంచి ప్రాజెక్ట్ అవుతుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో స్పీడ్ గా సినిమాలు చేయాలనే కోరిక లేదు. మంచి సబ్జెక్ట్ చేయాలి, నటుడిగా నా బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నా. ఎందుకంటే నటుడిగా నా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసే కథ ఇంకా దొరకలేదు అని అన్నారు. ఇన్నేళ్ల తర్వాత వేణు వరుసగా సినిమాలు, సిరీస్ లు ఓకే చేస్తుండటంతో ఆయన అభిమానులు, ప్రేక్షకులు సంతోషిస్తున్నారు.

 

Also Read : Chiranjeevi Blood Bank : తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులకు ఉచిత రక్తం.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి.. పేద పేషంట్స్ కోసం..