Site icon HashtagU Telugu

Venu Swami : బిగ్ బాస్ 8 లో వేణు స్వామి.. భారీ రెమ్యునరేషన్..?

Venu Swamy

Venu Swamy

బిగ్ బాస్ సీజన్ 8 (BiggBoss 8) మొదలు కాబోతున్న తరుణంలో అందులో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో హంగామా మొదలైంది. ఈసారి హౌస్ లోకి వెళ్లేది వీళ్లే అంటూ యూట్యూబ్ ఛానెల్స్ హడావిడి మొదలైంది. బిగ్ బాస్ తెలుగు 7 సీజన్లు పూర్తి చేసుకోగా 8వ సీజన్ ఆగష్టు చివర్లో లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో మొదలవుతుందని తెలుస్తుంది.

ఈసారి హౌజ్ లోకి ఎక్కువగా సోషల్ మీడియా (Social Media)లో పాపులర్ అయిన వారిని తీసుకుంటున్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వేణు స్వామి వెళ్తున్నారని టాక్. సినిమా సెలబ్రిటీస్, రాజకీయ నేతల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండే వేణు స్వామి (Venu Swami) సీజన్ 8 కోసం బిగ్ బాస్ టీం సంప్రదించినట్టు తెలుస్తుంది.

ఐతే హౌస్ లో ఎన్నాళ్లు ఉంటారన్నది కాదు కానీ బిగ్ బాస్ కు తాను రావాలంటే మాత్రం తాను అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వాలని ఆయన అడిగారట. బిగ్ బాస్ టీం తో ప్రస్తుతం వేణు స్వామి చర్చలు జరుగుతున్నాయని. ఆయన అడిగిన రెమ్యునరేషన్ ఇస్తే హౌజ్ లోకి వెళ్లేనుకు ఆయన సిద్ధమే అని అంటున్నారట. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 8 లో క్రేజీ కంటెస్టెంట్స్ ని తెచ్చే పనుల్లో టీం ఉంది.

వేణు స్వామి మాత్రమే కాదు ఈసారి హౌజ్ లోకి కుమారి ఆంటీ (Kumari Aunty), బర్రెలక్క కూడా తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయట. మొత్తానికి సీజన్ 8 సోషల్ మీడియా సెలబ్రిటీస్ కు అంకితం చేసేలా ఉన్నారని అనిపిస్తుంది. మరి ఫైనల్ గా వీరిలో ఎవరు హౌస్ లోకి వెళ్తారన్నది చూడాలి. సీజన్ 8 ని కూడా హోస్ట్ గా నాగార్జున కొనసాగించనున్నారు. 100 రోజుల పాటు బుల్లితెర ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు బిగ్ బాస్ సీజన్ 8 రెడీ కాబోతుంది.

Also Read : Pawan Kalyan : వీరమల్లు మూవీ.. పవన్ కి లాస్ అన్నట్టే..!