Site icon HashtagU Telugu

Venu Madhav : వేణుమాధవ్‌ రాసిన సన్నివేశాలు.. రాజమౌళి సినిమాకే హైలైట్ అయ్యాయి..

Venu Madhav writes those scenes in Rajamouli Movie

Venu Madhav writes those scenes in Rajamouli Movie

దివంగత టాలీవుడ్ నటుడు వేణుమాధవ్‌(Venu Madhav).. కమెడియన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక సినిమాల్లో తనదైన శైలి నటనతో అలరించి తెలుగు పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇక కామెడీ మీద మంచి పట్టు ఉన్న వేణుమాధవ్.. కొన్ని సినిమాలోని సన్నివేశాల కోసం దర్శకులకు తన సహాయం కూడా అందించేవారు. ఆ నేపథ్యంలోనే దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) సినిమాకి కూడా ఒక రెండు సీన్స్ రాయగా.. అవి సినిమాకే హైలైట్ అయ్యాయి. ఇంతకీ వేణుమాధవ్ రాసిన ఆ సీన్స్ ఏంటి..? ఆ సినిమా ఏంటి..?

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి, సై, ఛత్రపతి సినిమాల్లో వేణుమాధవ్ నటించారు. సింహాద్రిలో కాళ్ళు లేని వ్యక్తిగా అందర్నీ మోసం చేస్తూ, ఎన్టీఆర్ ని టీజ్ చేస్తూ కనిపించి ఆడియన్స్ ని నవ్విచారు. ఇక ఈ చిత్రం తరువాత వచ్చిన నితిన్ ‘సై'(Sye) సినిమాలో నల్ల బాలు అనే పాత్రని పోషించారు. ఆ సినిమాలో నల్ల బాలు పాత్ర పై మూడు సన్నివేశాలు ఉంటాయి. అయితే ముందు రాసుకున్నది ఒక సన్నివేశం మాత్రమే. కాలేజీ గోడల పై పెయింట్ వేస్తున్న సమయంలో కాలేజీ స్టూడెంట్స్ వచ్చి వేణుమాధవ్ ని కొట్టడంతో ఆ పాత్ర ముగిసిపోతుంది.

ఆ సీన్ చిత్రీకరిస్తున్న టైములో రాజమౌళి కట్ చెప్పడం మానేసి వేణుమాధవ్ కామెడీకి పడీపడీ నవ్వుకున్నారట. ఇక ఆ సీన్ ఎడిటింగ్ రూమ్ కి వెళ్లిన తరువాత కూడా పలువురు రాజమౌళితో.. ఈ పాత్రతో మరికొన్ని సీన్స్ ఉంటే మూవీకి హెల్ప్ అవుతుందని చెప్పారట. దీంతో రాజమౌళి, వేణుమాధవ్ ని పిలిపించి విషయం చెప్పారు. నల్ల బాలు పాత్రని ఇంకా పెంచాలి అని అనుకుంటున్నాము. అది ఎలా చేస్తే బాగుటుందని వేణుమాధవ్ ని రాజమౌళి సలహా అడిగారట.

“ఈ మూవీలో ఇంకే ఏఏ పాత్రలు ఉన్నాయో చెప్పండి . దాని బట్టి డెవలప్ చేద్దామని” వేణుమాధవ్ చెప్పారట. అలా సినిమాలోని మరో రెండు సన్నివేశాలు.. ఏసీపీ అరవింద్‌‌, భిక్షు యాదవ్‌ ని బెదిరించే సీన్స్ రాశారు. రాయడం మాత్రమే కాదు, సీన్స్ చిత్రీకరణలో కూడా వేణుమాధవ్ సలహాలు ఇచ్చారట. అవి బాగా నచ్చడంతో రాజమౌళి కూడా నో చెప్పకుండా ఫాలో అయ్యిపోయారట. ఆ మూడు సీన్స్ సై సినిమాలోనే హైలైట్ గా నిలిచాయి.

 

Also Read : Aadikeshava Trailer : ఆదికేశవ ట్రైలర్ టాక్ ..