Site icon HashtagU Telugu

యంగ్ డైరెక్టర్ కు ‘మెగా’ చాన్స్… మాఫియా డాన్ గా ‘మెగాస్టార్’!

Chiru Venky Kudumula

Chiru Venky Kudumula

ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగి, తిరుగులేని స్టార్డమ్ ను సొంతం చేసుకున్న నటుడు చిరంజీవి. డ్యాన్సులు, ఫైట్లకు కొత్త భాష్యం చెప్పిన చిరు… ఆ తర్వాత మెగాస్టార్ గా ఎదిగారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అందరివాడిగా కీర్తించబడుతున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే… మరోవైపు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారాయన. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పేరుతో రక్తదానం చేస్తూ… తనలోని సేవా దృక్పదాన్ని చాటుకుంటున్నారు చిరంజీవి.

ఇక సినిమాల విషయానికొస్తే… రాజకీయాల్లోకి వెళ్లి, కొన్నేళ్ల గ్యాప్ తర్వాత ‘ఖైదీ నం 150’ తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. రీ ఎంట్రీలోనూ తనలో ఏమాత్రం గ్రేస్ తగ్గలేదని నిరూపించారు. ఆ తర్వాత ‘సైరా’ సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో షేక్ చేశారు చిరు. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీ చేశారు. ఆ తర్వాత వరుస చిత్రాలను ఆయన లైన్లో పెట్టారు. ప్రస్తుతం మోహన్ రాజా డైరెక్షన్ లో చిరంజీవి చేస్తున్న ‘గాడ్ ఫాదర్’ సినిమా చిత్రీకరణ ముగింపు దశకి చేరుకుంది. ఆ తరువాత ‘భోళాశంకర్’ తో పాటు ‘వాల్తేరు వీర్రాజు’ సినిమాలు పూర్తిచేయనున్నారు మెగాస్టార్. ఈ రెండు ప్రాజెక్టుల షూటింగ్ లు కంప్లీట్ చేసిన తర్వాత, ఓ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయనున్నారు చిరు. ఆ యంగ్ డైరెక్టర్ మరెవరో కారు.. ఆయనే వెంకీ కుడుముల. దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తూనే.. భారీ విజయాలను అందుకున్నాడు వెంకీ కుడుముల. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఛలో’ .. ‘భీష్మ’ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ తర్వాత ప్రాజెక్టును ఆయన మెగాస్టార్ తోనే చేసేందుకు ఎంతో కాలంగా ట్రై చేస్తున్నారు. రీసెంట్ గా ఓ మంచి కథతో చిరును కలిశారు వెంకీ. స్టోరీ మొత్తాన్ని మెగాస్టార్ కు వివరించారు ఈ యంగ్ డైరెక్టర్. కథ నచ్చడంతో వెంటనే చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో ఎట్టకేలకు వెంకీ కుడుముల నిరీక్షణ ఫలించినట్టయింది. వీరి కలయికలో వచ్చే చిత్రంలో మెగాస్టార్ ఓ ‘మాఫియా డాన్’ గా కనిపించనున్నారట. మెగాస్టార్ చిరు ‘మాఫియా డాన్’ గా కనిపించనున్న ఈ సినిమాను, ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించనున్నట్లు సమాచారం. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించేందుకు దర్శుకుడు వెంకీ కుడుముల ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ ని సరికొత్త కోణంలో చూపించనున్నారని తెలుస్తోంది. మొత్తంమీద వెంకీ కుడుముల అతి తక్కువ సమయంలోనే మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేశాడు. మరి ‘మెగాస్టార్ – వెంకీ కుడుములు’ కాంబోలో వచ్చే మూవీ ఎలాంటి సంచలనాలను సృష్టించనుందో వేచి చూడాలి.

Exit mobile version