Venkatesh Daughter Wedding : ఈరోజే వెంకటేష్ కూతురి పెళ్లి..హడావిడి ఏది మరి..?

పెళ్లి (Wedding) అంటే ఎంత హడావిడి ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది సినీ ప్రముఖుల పెళ్లిళ్లు అంటే ఇక చెప్పాల్సిన పనిలేదు. టీవీ చానెల్స్ మొత్తం ఆ పెళ్లి వేడుకల్లోనే ఉంటాయి. పెళ్లి తంతు మొదలైన దగ్గరి నుండి..తిని అంత వెళ్లే వరకు ప్రతిదీ కవర్ చేస్తూ అభిమానులకు ఆనందాన్ని నింపుతూ…వారి TRP రేటింగ్ పెంచుకుంటాయి. ఇక ఇప్పుడు సోషల్ మీడియా హావ నడుస్తుండడం తో ఇంకాస్త కవరేజ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది టాలీవుడ్ లో టాప్ […]

Published By: HashtagU Telugu Desk
Venky Daughter

Venky Daughter

పెళ్లి (Wedding) అంటే ఎంత హడావిడి ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది సినీ ప్రముఖుల పెళ్లిళ్లు అంటే ఇక చెప్పాల్సిన పనిలేదు. టీవీ చానెల్స్ మొత్తం ఆ పెళ్లి వేడుకల్లోనే ఉంటాయి. పెళ్లి తంతు మొదలైన దగ్గరి నుండి..తిని అంత వెళ్లే వరకు ప్రతిదీ కవర్ చేస్తూ అభిమానులకు ఆనందాన్ని నింపుతూ…వారి TRP రేటింగ్ పెంచుకుంటాయి. ఇక ఇప్పుడు సోషల్ మీడియా హావ నడుస్తుండడం తో ఇంకాస్త కవరేజ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకరైన వెంకటేష్ కూతురు పెళ్లి తంతు మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా ఉండడం అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh)-నీరజ (Neeraja)ల రెండో కూతురు హవ్యవాహిని (Havyavahini) ఈరోజు (మార్చి 15న) పెళ్లి పీటలు ఎక్కబోతుంది. గతేడాది అక్టోబర్ 25న రాత్రి హవ్యవాహిని నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుకకు చిరంజీవి,మహేష్ తదితరులు కూడా హాజరయ్యారు. ఇక ఆ తర్వాత పెళ్లి తేది వివరాలు బయటికి పెద్దగా వినిపించలేదు. సడెన్ గా ఈరోజే పెళ్లి అని తెలిసి అంత షాక్ద అవుతున్నారు. ఈ విషయాలేవి ఇంతవరకూ మీడియాలో ఎక్కడా వినిపించకపోవడం.. ఎటువంటి హడావుడి కనిపించకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మాములుగా చిత్రసీమలో ఏ ఫంక్షన్ అయినా గట్టిగా ప్రచారం , హడావిడి ఉంటుంది. అలాంటిది వెంకటేష్ ఇంట్లో పెళ్లి సందడి అంటే ఏ రేంజ్ లో ఉండాలి. కానీ ఎలాంటి హడావిడి లేకుండా వెంకీ ప్లాన్ చేయడం అభిమానులను కాస్త నిరాశకు గురి చేస్తుంది. మొదటి నుండి కూడా వెంకీ..ఫ్యామిలీ విషయాలు , వేడుకలు పెద్దగా బయటకు తీసుకురాలేదు. ఏది ఉన్న ఫామిలీ సభ్యులకు మాత్రమే ఆహ్వానాలు అందించడం..చిత్రసీమలో దగ్గర అనుకున్నవారినే పిలవడం చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు కూతురి పెళ్లి విషయంలో కూడా అదే ఫాలో అవుతున్నాడు.

Read Also : Niharika Konidela : ‘కోరిక’ తీర్చుకోవడం కోసమే రెండో పెళ్లి చేసుకుంటా – మెగా డాటర్ నిహారిక

  Last Updated: 15 Mar 2024, 02:54 PM IST