Site icon HashtagU Telugu

Venkatesh Trisha : వెంకటేష్.. త్రిష.. సూపర్ హిట్ కాంబో రిపీట్..!

Venkatesh Trisha Super Hit Combination Repeate

Venkatesh Trisha Super Hit Combination Repeate

Venkatesh Trisha విక్టరీ వెంకటేష్ సైంధవ్ సినిమా ఫ్లాప్ తర్వాత హిట్ డైరెక్టర్ అనీల్ రావిపుడితోనే తన నెక్స్ట్ సినిమా లాక్ చేసుకున్నాడని తెలుస్తుంది. దిల్ రాజు బ్యానర్ లో అనీల్ రావిపుడి డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ ఫ్రెండ్ షిప్ కథతో ఈ సినిమా వస్తుందట. ఈ సినిమాలో వెంకటేష్ సరసన కోలీవుడ్ భామ త్రిషని హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

వెంకటేష్ తో ఆల్రెడీ ఇప్పటికే 3 సినిమాల్లో నటించింది త్రిష. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, నమో వెంకటేశ, బాడీ గార్డ్ ఇలా 3 సినిమాల్లో నటించి మూడు సినిమాలతో హిట్ అందుకున్నారు. ఇప్పుడు మరోసారి ఇద్దరు కలిసి జత కడుతున్నారు. వెంకటేష్ త్రిష ఈ జోడీ ఆడియన్స్ కు సూపర్ ట్రీట్ అందించనున్నారు.

ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ త్రిష వరుస టాలీవుడ్ ఆఫర్లను అందుకుంటుంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో ఛాన్స్ అందుకున్న అమ్మడు. వెంకటేష్ అనీల్ కాంబో మూవీలో కూడా భాగం అవుతుందని తెలుస్తుంది. హిట్ కాంబినేషన్ కాబట్టి ఈ సినిమా రిజల్ట్ కూడా సూపర్ హిట్ అని ఫిక్స్ అయ్యారు దగ్గుబాటి ఫ్యాన్స్.

Also Read : Balakrishna : బాలయ్య సినిమాలకు లాంగ్ బ్రేక్.. రీజన్ అదేనా..?