Site icon HashtagU Telugu

Venkatesh : వెంకటేష్ కూతురి రిసెప్షన్‌లో.. ఎన్ని రకాల భోజనాలు పెట్టారో చూశారా..!

Venkatesh Second Daughter Havya Vahini Wedding Reception Food Items Video Gone Viral

Venkatesh Second Daughter Havya Vahini Wedding Reception Food Items Video Gone Viral

Venkatesh : టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఇటీవల తన రెండో కుమార్తె ‘హవ్యవాహిని’కి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించిన సంగతి తెలిసిందే. విజయవాడ డాక్టర్ కుటుంబానికి చెందిన డాక్టర్ నిశాంత్ అనే కుర్రాడికి వెంకీ మామ తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేసారు. ఇక ఈ పెళ్లిని, ఎంగేజ్మెంట్‌ని వెంకీ మామ చాలా సింపుల్ గా చేసేసారు. ఎటువంటి హడావుడి లేకుండా, పెద్ద ఈవెంట్, సెలబ్రేషన్స్ లేకుండా వెంకటేష్ తన కూతురు వెడ్డింగ్ ని పూర్తి చేసేసారు.

ఇక ఈ పెళ్లికి సంబంధించిన రిసెప్షన్ ని వరుడు కుటుంబం ఇటీవల విజయవాడలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ రిసెప్షన్ కి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో రిసెప్షన్ లో పెట్టిన రకరకాల భోజనాలు గురించి చూపించారు. ఈ రిసెప్షన్ లో ఇండియన్, కాంటినెంటన్, ఆసియన్, ఇటాలియన్ ఫుడ్స్ తో గుమగుమలాడించారు. వెజ్ అండ్ నాన్ వెజ్ లో స్పెషల్ డిషెస్ తో అతిథులకు నోరూరించారట. మరి ఆ వంటకాలు వైపు మీరు ఓ లుక్ వేసేయండి.

వెంకటేష్ సినిమాలు విషయానికి వస్తే.. ఈ ఏడాది స్టార్టింగ్ లో ‘సైంధవ్‌’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. వెంకటేష్ 75వ చిత్రంగా రూపొందిన ఈ మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆ అంచనాలను అందుకోలేక బోల్తా పడింది. ప్రస్తుతం వెంకీ అభిమానులంతా నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ తన కొత్త సినిమా చేయబోతున్నారంటూ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాని దిల్ రాజు నిర్మించబోతున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అఫీషియల్ అనౌన్స్ చేయనున్నారని సమాచారం. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ ఇప్పటికే F2, F3 సినిమాలు చేసారు. అయితే ఆ రెండు మల్టీస్టారర్. ఈసారి సింగల్ మూవీ చేయనున్నారని సమాచారం.

Also read : Amala Paul : అమలాపాల్ సీమంతం వేడుక ఫోటోలు చూశారా..!
.