సంక్రాంతి కానుకగా ఇప్పటికే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారజ్ సినిమాలు రిలీజ్ కాగా ఆ రెండిటిలో రామ్ చరణ్ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకోగా డాకు మహారాజ్ సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. ఇక ఈ సంక్రాంతికి రాబోతున్న మరో సినిమా సంక్రాంతికి వస్తున్నాం.
విక్టరీ వెంకటేష్ (Venkatesh) అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఆల్రెడీ ఎఫ్2, ఎఫ్3 సినిమాలతో సత్తా చాటిన ఈ కాంబో థర్డ్ మూవీతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vastunnam) సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. గేమ్ ఛేంజర్ (Game Changer) నిరాశపరచగా డాకు మహారాజ్ కేవలం మాస్ ఆడియన్స్ కోసమే అన్నట్టు ఉండగా సంక్రాంతిక్ వస్తున్నాం సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించేలా ఉంది.
ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతుంది. సినిమాలోని సాంగ్స్ సూపర్ హిట్ కాగా ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్ లో చేశారు. అందుకే హైదరాబాద్ లో సంక్రాంతికి వస్తున్నాం టికెట్ లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నట్టు తెలుస్తుంది. ప్రీ బుకింగ్స్ తోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి విన్నర్ అనిపించేలా ఉందని తెలుస్తుంది. వెంకటేష్ లాస్ట్ ఇయర్ పొంగల్ కి కూడా సైంధవ్ సినిమాతో వచ్చాడు. ఐతే ఆ సినిమా యాక్షన్ సినిమా కాగా అది డిజాస్టర్ అయ్యింది. ఐతే సంక్రాంతికి వస్తున్నాం మాత్రం వెంకీకి సూపర్ హిట్ ఇచ్చేలా ఉంది.