Site icon HashtagU Telugu

Sankranthiki Vasthunnam : దూసుకుపోతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ కలెక్షన్స్.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు తెలుసా?

Sankranthiki Vasthunnam Collections

Sankranthiki Vasthunnam Collections

Sankranthiki Vasthunnam : వెంకటేష్(Venkatesh) ఈ సంక్రాంతి పండక్కి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చి అదరగొడుతున్నాడు. జనవరి 14న రిలీజయిన ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట నుంచే ఫుల్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. దీంతో కలెక్షన్స్ కూడా అదరగొడుతున్నారు.

మొదటి రోజు సంక్రాంతికి వస్తున్నాం సినిమా 45 కోట్ల గ్రాస్ వసూలు చేసి వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. ఇప్పటికే మూడు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ దాటగా నాలుగు రోజుల్లో ఈ సినిమా 131 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. నేడు, రేపు కూడా వీకెండ్స్ ఉండటంతో ఈ కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది.

ఇప్పటికే చాలా థియేటర్స్ లో గేమ్ ఛేంజర్ సినిమా తీసేసి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వేశారు. ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని నిర్మాత దిల్ రాజు నిన్న సక్సెస్ మీట్ లో తెలిపారు. ఊళ్ళల్లో ఈ సినిమాకు ఫుల్ క్రేజ్ ఉండటం, నేడు, రేపు వీకెండ్ కావడం, ఫిబ్రవరి 7 వరకు పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ సినిమాకు బాగా కలిసి వచ్చి 200 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలుస్తుంది. ఇప్పటికే అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయి ఫుల్ ప్రాఫిట్స్ లో ఉంది ఈ సినిమా.

 

Also Read : Faria Abdullah : డ్యాన్స్ షో జడ్జిగా మారిన హీరోయిన్.. ఆహా ఓటీటీలో డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2..