Site icon HashtagU Telugu

Sankranthiki Vasthunnam : వెంకీమామ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?

sankranthiki vasthunnam sequel

sankranthiki vasthunnam sequel

Sankranthiki Vasthunnam : దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిన్న జనవరి 14 సంక్రాంతి సందర్భంగా థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాకి ముందు నుంచి హైప్ ఉండటంతో ఓపెనింగ్ రోజు నుంచే కలెక్షన్స్ అదరగొడుతూనే ఫుల్ హిట్ టాక్ వచ్చింది. ఈ సినిమా సాంగ్స్ పెద్ద హిట్ అవ్వడం, ప్రమోషన్స్ కొత్తగా చేయడం, సినిమాకు జనాల్లో ఉన్న క్రేజ్ చూసి ముందు నుంచే పెద్ద హిట్ అవుద్ది అనుకున్నారు అంతా.

బుకింగ్స్ కూడా అప్పుడే మూడు రోజుల వరకు అన్ని థియేటర్స్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయాయి. తాజాగా మూవీ యూనిట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా మొదటి రోజే 45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అమెరికాలోనే ఆల్మోస్ట్ 5 కోట్లపైన కలెక్ట్ చేసింది. ఇది వెంకీమామ కెరీర్ లోనే ఓపెనింగ్స్.

ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 90 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే చాలు. ఈ క్రేజ్ చూస్తుంటే ఈజీగా 100 కోట్ల గ్రాస్ దాటి సూపర్ హిట్ గా నిలిచి వెంకీమామ కెరీర్ లో మొదటి 100 కోట్ల సినిమాగా నిలుస్తుందని తెలుస్తుంది. అమెరికాలో కూడా నేటితో 1 మిలియన్ డాలర్స్ వసూలు చేయనుంది. మొత్తానికి ఈ సంక్రాంతికి వెంకీమామ పెద్ద హిట్టే కొట్టాడు.

Also Read : Naga Chaitanya – Sobhita : పెళ్లి తర్వాత మొదటి సంక్రాంతి.. నాగచైతన్య, శోభిత ఫోటో వైరల్..