Site icon HashtagU Telugu

Sankranthiki Vasthunnam: ఇదెక్కడి ట్విస్ట్.. ఓటీటీలో కంటే ముందుగా టీవీలో వెంకీ మామ మూవీ.. స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే!

Sankranthiki Vasthunnam

Sankranthiki Vasthunnam

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. గత నెల సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఫుల్ పక్క ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రతి ఒక్కరిని మెప్పించింది. థియేటర్లో బాగానే వసూళ్ల వర్షం కూడా కురిపించింది. ముఖ్యంగా ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, వెంకీ మామ, బుల్లి రాజు, మీనాక్షి చౌదరి ల కామెడీ టైమింగ్ అదుర్స్ అని చెప్పాలి.

అయితే ఈ సినిమాను థియేటర్లో చూసి బాగా ఎంజాయ్ చేసిన అభిమానులు ఓటీటీ లోకి ఎప్పుడెప్పుడు ఇస్తుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ అభిమానులకు ఊహించిన ట్విస్ట్ ఇస్తూ భారీ శుభవార్తను తెలిపారు. అదేమిటంటే ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా బుల్లితెర ప్రేక్షకులను అలరించడం కోసం సిద్ధమయ్యింది. ఓటీటీలో కంటే ముందుగా టీవీ ఛానల్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. జీ తెలుగులో ఫైనల్ గా ప్రీమియర్ డేట్ ని ఫిక్స్ చేశారు మూవీ మేకర్స్. మార్చి 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానల్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రసారం కానున్నట్లు ప్రకటించింది.

 

మామూలుగా థియేటర్లో విడుదలైన ఏ సినిమా అయినా ఓటీటీ లోకి విడుదల అవుతుంది. ఆ తర్వాత మళ్లీ బుల్లితెరపైకి టీవీలలో వస్తుంది. కానీ మొదటిసారి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ పద్ధతికి చెక్ పెడుతూ ఊహించని షాక్ ఇస్తూ ఓటీటీని కాదని ఏకంగా టీవీలో ముందుగా ప్రసారమవుతూ కొత్త ట్రెండ్‌ కు నాంది పలికింది. దీంతో అభిమానులు ఇది నిజంగా సరికొత్త ట్రెండ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుంది అన్న విషయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమా దాదాపుగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించిన విషయం తెలిసిందే. 2027లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా సీక్వెల్ కూడా రానుంది.