Venkatesh Saindhav Teaser విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న సినిమా సైంధవ్. ప్రచార చిత్రాలతోనే సినిమాపై సూపర్ బజ్ ఏర్పడగా లేటెస్ట్ గా సినిమా నుంచి టీజర్ మరింత అంచనాలు పెంచింది. సైంధవ్ సినిమా టీజర్ వెంకటేష్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇవ్వడం గ్యారెంటీ అన్నట్టు ఉంది. సైంధవ్ ఫుల్ లెంగ్త్ మాస్ మూవీతో వస్తున్నారు వెంకటేష్.
సినిమా కథ కథనాలు అన్ని వెంకటేష్ (Venkatesh) ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా కోరుతున్న మాస్ అప్పీల్ ని కలిగి ఉన్నాయి. ముఖ్యంగా లెక్క మారుద్ది నా కొడకల్లారా అంటూ వెంకటేష్ మాస్ వార్నింగ్ అదిరిపోయిందని చెప్పొచ్చు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న సైంధవ్ సినిమా వస్తుంది. వెంకటేష్ 75వ సినిమాగా సైంధవ్ (Saindhav Teaser) సెన్సేషన్ సృష్టించేలా ఉంది.
హిట్ సీక్వెల్స్ కి కొద్దిగా గ్యాప్ ఇచ్చిన శైలేష్ (Sailesh) విక్టరీ వెంకటేష్ తో భారీ స్కెచ్ వేసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వెంకటేష్ తో పాటుగా శ్రద్ధ శ్రీనాథ్, రుహాని శర్మ, ఆడ్రియా నటిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్ధికి ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.
వెంకటేష్ మాస్ సినిమా చేస్తే బాక్సులు బద్ధలు అవ్వాల్సిందే. చాలా రోజుల తర్వాత వెంకీ మామ నుంచి వస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. సంక్రాంతికి సినిమాల పండుగ తో తెలుగు ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పక్కా అని చెప్పొచ్చు. ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు.
Also Read : Nani Hi Nanna : ఎమోషనల్ సినిమాలో ఈ లిప్ లాక్స్ ఏంటి బాసు..?