HBD Venky : నవాబు లుక్ లో విక్టరీ వెంకటేశ్!

విక్టరీ వెంకటేశ్ అంటేనే వైవిధ్యం.. ఆయన నుంచి సినిమా వస్తుంటే.. మినిమమ్ గ్యారంటీ. ఇతర హీరోలు మూస ధోరణిలో సినిమాలు చేస్తుంటే.. వెంకీ మాత్రం ఎప్పుడూ నూతనత్వాన్ని కోరుకుంటూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంటారు.

Published By: HashtagU Telugu Desk
Venkatesh

Venkatesh

ఇవాళ రోజు హీరో వెంకటేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న F3  నుంచి ఒక ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు చిత్ర యూనిట్. చార్మినార్ చారిత్రాత్మక ప్రదేశంలో వెంకటేష్ నవాబ్ లాగా పోజులిచ్చి తన విలక్షణమైన వ్యవహారశైలి చూడొచ్చు. డబ్బు ప్రధానంగా నడిచే ఈ మూవీలో వెంకీ చేతిలో కరెన్సీ నోట్లు పట్టుకుని కనిపిస్తాడు. వెంకటేష్ ఇక్కడ బ్లేజర్, కార్గో ప్యాంట్ ధరించి స్టైలిష్ గెటప్‌తో పోస్టర్‌లో ఉన్నాడు. ఈ కొత్త పోస్టర్  ను చూసి వెంకీ అభిమానులు ఆనందపడిపోతున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. ఈ చిత్రంలో వెంకటేష్ మరో ఫన్ పాత్రను పోషిస్తున్నాడు. అతను అంధత్వ సమస్యతో అలరించనున్నాడు. సక్సెస్ ఫుల్ మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇతర ప్రధాన పాత్రలో తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

 

  Last Updated: 13 Dec 2021, 01:20 PM IST