Site icon HashtagU Telugu

Venkatesh : ఎక్కడ ఆగిందో అక్కడే మొదలైంది.. వెంకటేష్ నెక్స్ట్ సినిమా అదేనా..?

Venaktesh Anil Ravipudi movie shooting doing Silently

Venaktesh Anil Ravipudi movie shooting doing Silently

విక్టరీ వెంకటేష్ (Venkatesh) నటించిన సైంధవ్ సినిమా సంక్రాంతికి రిలీజై ఫ్లాప్ అయ్యింది. శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా భారీ యాక్షన్ మూవీగా వచ్చింది. కానీ ఆడియన్స్ ని మెప్పించడంలో సినిమా ఫెయిల్ అయ్యింది. ఇక ఈ సినిమా రిజల్ట్ మీద నిరుత్సాహంగా ఉన్న వెంకటేష్ అర్జెంట్ గా ఒక హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలో వెంకటేష్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో సినిమా చేయాలని అనుకుంటున్నారట.

We’re now on WhatsApp : Click to Join

పెళ్లిచూపులు, ఈనగరానికి ఏమైంది, కీడా కోలా (Keeda Cola) ఈ 3 సినిమాలతో డైరెక్టర్ గా తన మార్క్ సెట్ చేసుకున్న తరుణ్ భాస్కర్ యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకునే కథ కథనాలతో వస్తున్నారు. డైరెక్టర్ గానే కాదు నటుడిగా కూడా ఈమధ్య బిజీ అయ్యాడు తరుణ్ భాస్కర్. అయితే వెంకటేష్ కోసం ఒక కథ చెప్పిన తరుణ్ భాస్కర్ కొన్నాళ్లుగా అది పెండింగ్ పడుతూ వచ్చింది.

సినిమా సెకండ్ హాఫ్ సరిగా రాలేదని ఆ ప్రాజెక్ట్ ఆగింది. అయితే ఇప్పుడు ఆ కథను మళ్లీ పూర్తి చేసేలా తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar) వర్క్ చేస్తున్నారట. వెంకటేష్ నెక్స్ట్ సినిమా దాదాపు అదే అవుతుందని అంటున్నారు. వెంకీ మామతో తరుణ్ భాస్కర్ కామెడీ సినిమా చేస్తే తప్పకుండా అది వర్క్ అవుట్ అవుతుందని చెప్పొచ్చు.

Also Read : Ashika Ranganath : సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ ఆప్షన్.. కన్నడ భామ లక్కీయెస్ట్..!