Venkatesh : వెంకటేష్ తో మరోసారి అలాంటి అటెంప్ట్.. బడా ప్రొడ్యూసర్ ప్లాన్ అదుర్స్..!

విక్టరీ వెంకటేష్ (Venkatesh) ఈ సంక్రాంతికి సైంధవ్ అంటూ వచ్చి నిరాశపరచాడు. శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా వెంకట్ బోయినపల్లి నిర్మించారు. సినిమా సంక్రాంతి రేసులో భారీ

Published By: HashtagU Telugu Desk
Venaktesh Anil Ravipudi movie shooting doing Silently

Venaktesh Anil Ravipudi movie shooting doing Silently

విక్టరీ వెంకటేష్ (Venkatesh) ఈ సంక్రాంతికి సైంధవ్ అంటూ వచ్చి నిరాశపరచాడు. శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా వెంకట్ బోయినపల్లి నిర్మించారు. సినిమా సంక్రాంతి రేసులో భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయ్యింది. ఈ రిజల్ట్ తో వెంకటేష్ చాలా డిజప్పాయింట్ అయినట్టు తెలుస్తుంది.

వెంకటేష్ చాలా కాలం తర్వాత చేసిన ఈ యాక్షన్ మూవీని ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదు. అందుకే వెంకటేష్ తన రెగ్యులర్ ఫార్మెట్ లోనే సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఎఫ్2,ఎఫ్3 సినిమాలతో హిట్ అందుకున్న అనీల్ రావిపుడితోనే వెంకటేష్ నెక్స్ట్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారట. భగవంత్ కేసరి తర్వాత అనీల్ రావిపుడి కూడా నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయలేదు. వెంకటేష్ తోనే తన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఎఫ్2, ఎఫ్3 సినిమాలను నిర్మించిన దిల్ రాజు ఈ సినిమా కూడా నిర్మిస్తారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఎఫ్3 కి సీక్వెల్ లా కాకుండా కొత్త కథతో వస్తున్నారని తెలుస్తుంది.

వెంకటేష్ ఫ్యామిలీ హీరోనే అయినా ఆయన చేసిన యాక్షన్ సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరించారు. అయితే సైంధవ్ సినిమా కాలిక్యులేషన్ ఎందుకో వర్క్ అవుట్ అవ్వలేదు. అందుకే వెంకటేష్ కూడా తనని ఆడియన్స్ ఎలా చూడాలని అనుకుంటున్నారో అలాంటి సినిమాలే చేయాలని ఫిక్స్ అయ్యారు. మరోపక్క తరుణ్ భాస్కర్ కూడా వెంకటేష్ తో సినిమా చేయాలని ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాడు.

అనీల్ రావిపుడి తర్వాత తరుణ్ భాస్కర్ తో సినిమా ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు. సురేష్ ప్రొడక్షన్ తో తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో సినిమాలు చేస్తున్నాడు. వెంకటేష్ సినిమా కూడా ఈ కాంబో రావాల్సి ఉంది.

Also Read :

  Last Updated: 02 Feb 2024, 08:08 AM IST