Site icon HashtagU Telugu

Venkatesh Narappa: నారప్ప మళ్లీ వస్తున్నాడప్పా!

Narappa

Narappa

విక్టరీ వెంకటేష్ (Venkatesh) బర్త్ డే కానుకగా డిసెంబర్13న ‘నారప్ప’ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. వెంకటేష్ కథానాయుకుడిగా, సురేష్ ప్రొడక్షన్స్ (Suresh Productions), వి క్రియేషన్స్ నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ‘నారప్ప’ లాక్ డౌన్ పరిస్థితుల నేపధ్యంలో ఓటీటీలో విడుదలై బిగ్గెస్ట్ హిట్ ని అందుకుంది.

అయితే ‘నారప్ప’ ని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఆశపడ్డారు అభిమానులు. ‘నారప్ప’ థియేటర్స్ విడుదల కాకపోవడంతో నిరాశ చెందారు. ఇప్పుడు ‘నారప్ప’ థియేటర్స్ లో విడుదలౌతుండటంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఓటీటీలో విడుదలైన సినిమాని థియేటర్స్ లో విడుదల చేయడం ఇదే తొలిసారి. దీంతో విక్టరీ వెంకటేష్ (Venkatesh) అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తారాగణం: దగ్గుబాటి వెంకటేష్, ప్రియమణి

సాంకేతిక విభాగం :

బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్

నిర్మాతలు: డి. సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను, అమెజాన్ ప్రైమ్ వీడియో

సంగీతం: మణి శర్మ

డీవోపీ: శ్యామ్ కె. నాయుడు

ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్

దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల

యాక్షన్: పీటర్ హెయిన్స్

ఆర్ట్: గాంధీ నడికుడికార్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- విజయ్ డొంకాడ

Also Read: Sex Racket: అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టురట్టు!