Site icon HashtagU Telugu

Venkatesh – Mahesh Babu : మల్టీప్లెక్స్ కట్టబోతున్న పెద్దోడు, చిన్నోడు.. హైదరాబాద్ సుదర్శన్..

Venkatesh Is On Board For Mahesh Babu Asian Cinemas At Hyderabad Sudarshan Theater

Venkatesh Is On Board For Mahesh Babu Asian Cinemas At Hyderabad Sudarshan Theater

Venkatesh – Mahesh Babu : సినిమా పరిశ్రమలో ఫేమ్ ఉన్నప్పుడే బాగా సంపాదించుకోవాలి అనే సామెతని ప్రస్తుతం ఉన్న నటీనటులు బాగా ఫాలో అవుతున్నారు. సినిమాలు మరియు బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా వచ్చిన రెమ్యూనరేషన్స్ ని ఇతర బిజినెస్ లో పెడుతూ తమకంటూ ఒక ఫైన్షియల్ సెక్యూరిటీని క్రియేట్ చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే టాలీవుడ్ లో పలువురు స్టార్స్.. థియేటర్ బిజినెస్ లో తమ పెట్టుబడులను పెడుతున్నారు.

ఆడియన్స్ కి మల్టీప్లెక్స్ కల్చర్ అలవాటు అవుతుండడంతో.. ప్రస్తుతం ఎక్కడపడితే అక్కడ మల్టీప్లెక్స్ లు పుట్టుకొస్తున్నాయి. సౌత్ లో ఆసియన్ మల్టీప్లెక్స్ సంస్థ.. మెల్లిమెల్లిగా ఒక పెద్ద మల్టీప్లెక్స్ చైన్ ని క్రియేట్ చేస్తుంది. మొదటిగా మహేష్ బాబుతో కలిసి హైదరాబాద్ లో AMB మాల్ ని ప్రారంభించిన ఈ సంస్థ.. కర్ణాటకలో కూడా మహేష్ తో కలిస్ ఒక మల్టీప్లెక్స్ ని ఓపెన్ చేస్తున్నారు. ఇక హైదరాబాద్ లోనే అల్లు అర్జున్ తో కలిసి AAA మాల్ ని ఓపెన్ చేసిన సంగతి తెలిసింది.

అలాగే రవితేజ, విజయ్ దేవరకొండ కూడా ఆసియన్ సంస్థతో కలిసి హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ ని ఓపెన్ చేయబోతున్నారు. ఇక తాజాగా విక్టరీ వెంకటేష్ కూడా ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్నారట. AMB, కర్ణాటక మల్టీప్లెక్స్ తో పాటు మహేష్ బాబు.. హైదరాబాద్ లో మరో మల్టీప్లెక్స్ ని తీసుకు రాబోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ ఫేమస్ సింగల్ స్క్రీన్ థియేటర్ సుదర్శన్ థియేటర్ ని తొలిగించి, అక్కడ ఓ మల్టీప్లెక్స్ ని తీసుకు రాబోతున్నారు.

మహేష్ బాబు, ఆసియన్ సంస్థ కలిసి నిర్మిస్తున్న ఈ మల్టీప్లెక్స్‌లో.. ఇప్పుడు వెంకటేష్ కూడా భాగం అవుతున్నారట. చిన్నోడుతో కలిసి బిజినెస్ చేయడానికి పెద్దోడు కూడా ఓకే చెప్పడంతో.. ఇప్పుడు AMB కాస్త.. విక్టరీ AMB అవ్వబోతుంది. మరి ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఇంకెంతమంది స్టార్స్ వస్తారో చూడాలి.

Also read : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ సినిమా నుంచి శ్రీలీల అవుట్.. మమితా బైజు ఇన్..!