Site icon HashtagU Telugu

Venkatesh : తమిళ దర్శకుడితో వెంకటేష్..?

Venkatesh Interest To Do Movie With Karthik Subbaraj

Venkatesh Interest To Do Movie With Karthik Subbaraj

Venkatesh కోలీవుడ్ లో ప్రతిభ గల దర్శకుల్లో కార్తీక్ సుబ్బరాజ్ కూడా ఒకరు. ఆయన చేసిన పిజ్జా, మెర్క్యురీ, జిగర్ తండ, జగమే తంతిరం, మహాన్ సినిమాలు అతని డైరెక్షన్ టాలెంట్ చూపించాయి. సూపర్ స్టార్ రజినికాంత్ తో పేట సినిమా చేసిన కార్తీక్ లేటెస్ట్ గా జిగర్ తండా (Jigar Thanda 2) డబుల్ ఎక్స్ తో రాబోతున్నారు. నవంబర్ 10న ఈ సినిమా రిలీజ్ అవుతుండగా సినిమాను తెలుగులో కూడా అదే రోజున అదే పేరుతో వస్తుంది. జిగర్ తండా సినిమాకు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు.

ఆ సినిమా తెలుగులో గద్దలకొండ గణేష్ గా రిలీజైంది. ఇదిలాఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విక్టరీ వెంకటేష్ గెస్ట్ గా వచ్చారు. వేడుకలో భాగంగా కార్తీక్ సుబ్బరాజ్ మంచి దర్శకుడని అతనితో తనకు సినిమా చేయాలని ఉందని చెప్పారు. వెంకటేష్ లాంటి హీరో తన డైరెక్షన్ లో సినిమా చేయాలని ఉందని చెప్పడం గొప్ప విషయం. తప్పకుండా కార్తీక్ సుబ్బరాజ్ ఒక మంచి కథతో వస్తే వెంకటేష్ సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తుంది.

Also Read : Ravi Teja: మరోసారి రవితేజ నట విశ్వరూపం.. ఈగల్ టీజర్ తో గూస్ బమ్స్!

జిగర్ తండ 2 హిట్ పడితే మాత్రం వెంకటేష్ తో కార్తీక్ (Karthik Subbaraj) సినిమా ప్లానింగ్ ఉంటుందని చెప్పొచ్చు. వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. వెంకటేష్ నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న యాక్షన్ సినిమాగా సైంధవ్ (Saindhav) సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.

వెంకటేష్ 75వ సినిమా సైంధవ్ కాగా 76వ సినిమా ఎవరితో ఉంటుంది అన్నది తెలియాల్సి ఉంది. తరుణ్ భాస్కర్ కూడా వెంకటేష్ తో సినిమాకు రెడీ అంటున్నాడు. అంతకుముందే ఈ కాంబోలో సినిమా రావాల్సి ఉన్నా స్క్రీన్ ప్లే మరింత బాగా రావాలని గ్యాప్ తీసుకున్నారు. త్వరలోనే తరుణ్ భాస్కర్ తో వెంకటేష్ మూవీ ఉంటుందని చెప్పుకుంటున్నారు.

We’re now on WhatsApp : Click to Join