నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో వస్తున్న షో అన్ స్టాపబుల్. ఇప్పటికే 3 సీజన్లు సూపర్ హిట్ అవ్వగా ఈమధ్యనే అన్ స్టాపబుల్ సీజన్ 4ని ప్రారంభించారు. సీజన్ 4 లో బాలకృష్ణ (Balakrishna) ముందు ఇప్పటికే చాలామంది గెస్టులు వచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయగా త్వరలో సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ రాబోతున్నారని తెలుస్తుంది. వెంకటేష్ తో పాటు అనీల్ రావిపుడి కూడా ఈ షోలో పాల్గొంటారని తెలుస్తుంది.
బాలయ్య అన్ స్టాపబుల్ షోలో వెంకటేష్ (Venkatesh) పాల్గొననున్నారని టాక్. ఈ నెల 22న ఈ ఎపిసోడ్ షూటింగ్ జరగనుందట. సంక్రాంతికి వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా వస్తుంది. అదే సంక్రాంతికి బాలయ్య డాకు మహారాజ్ గా వస్తున్నాడు. ఈ రెండు సినిమాల మధ్య ఫైట్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది.
ఐతే అన్ స్టాపబుల్ (Unstoppable) ఎపిసోడ్ లో బాలయ్య, వెంకీ తమ సినిమాల మధ్య పోటీ గురించి ఇంకా మిగతా విషయాల గురించి మాట్లాడనున్నారు. అసలు వెంకటేష్ ని బాలకృష్ణ, బాలయ్యని వెంకీమామ ఏమని పిలుస్తారు వారి మధ్య చిట్ చాట్ ఎలా ఉంటుంది అని ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఈ షో వల్ల బలయ్య ఆడియన్స్ కి మరింత దగ్గర అయ్యాడు. మరి వెంకీ తో బాలయ్య స్పెషల్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి. సంక్రాంతికి వారి సినిమాలు వస్తున్నా సరే రెండు సినిమాలు బాగా ఆడాలని ఇద్దరు కోరుకుంటారు. సంక్రాంతికి బాలయ్య మాస్ సినిమాగా డాకు మహారాజ్ వస్తుంటే.. సంక్రాంతికి ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వెంకటేష్ రాబోతున్నాడు.