వెంకటేష్(Venkatesh), రానా(Rana) ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన బాలీవుడ్ సిరీస్ రానా నాయుడు(Rana Naidu). నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ రిలీజయింది. ఇందులో రానా, వెంకటేష్ తండ్రి కొడుకులుగా నటించి మెప్పించారు. అయితే రానా నాయుడు సిరీస్ పై తెలుగులో తీవ్ర విమర్శలు వచ్చాయి. చాలా నెట్‌ఫ్లిక్స్(Netflix) కంటెంట్స్ లాగే ఇందులో ఎక్కువగా బోల్డ్, అడల్ట్ కంటెంట్ ఉండటం, బూతులు ఉండటంతో వెంకటేష్ ఇలాంటి పాత్ర చేశాడా అని ఆశ్చర్యపోయారు అంతా.
ఇన్నాళ్లు ఫ్యామిలీ హీరోగా ఉన్న వెంకటేష్ ఒక్కసారిగా అడల్ట్ హీరో పాత్ర చేయడంతో విమర్శలు కూడా వచ్చాయి. ఈ సిరీస్ బాలీవుడ్ లో సక్సెస్ అయినా ఇక్కడ తెలుగులో మాత్రం విమర్శలపాలైంది. అయినా గతంలోనే ఈ సిరీస్ కి సీజన్ 2 ఉంటుందని వెంకటేష్, రానా తెలిపారు.
తాజాగా వెంకటేష్ 75వ సినిమా ‘సైంధవ్'(Saindhav) టీజర్ లాంచ్ ఈవెంట్ లో వెంకటేష్ మీడియాతో ముచ్చటించగా రానా నాయుడు సీజన్ 2 పై ప్రశ్నించారు. దీనికి వెంకటేష్ సమాధానమిస్తూ.. రానా నాయుడు సిరీస్ ప్రపంచవ్యాప్తంగా మంచి రీచ్ వచ్చింది. నేను అహ్మదాబాద్ కి మ్యాచ్ కి వెళ్ళినప్పుడు కూడా నన్ను నాగా నాయుడు గానే గుర్తుపట్టారు. బాలీవుడ్ లో దీనికి మంచి ఆదరణ లభించింది. సీజన్ 2 త్వరలోనే ప్రారంభమవుతుంది. ఈసారి అడల్ట్ కంటెంట్ కొంచెం తగ్గుతుంది. నా పాత్ర మళ్ళీ వస్తుంది అని తెలిపారు. అంటే రానా నాయుడు మరోసారి బోల్డ్ గా రాబోతుందని తెలుస్తుంది. ఈసారి ఎన్ని అడల్ట్ సీన్స్ చూపిస్తారో సిరీస్ లో.
Also Read : Anil Sunkara : ఖరీదైన తప్పులు చేశాం.. ఏజెంట్, భోళాశంకర్ పై మరోసారి నిర్మాత వ్యాఖ్యలు..