Campaign : తెలంగాణ లో జై కాంగ్రెస్..ఏపీలో జై బిజెపి ..వెంకీ ‘అయ్యో.. అయ్యో ..అయ్యయ్యో ‘

తెలంగాణ లో ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తన వియ్యంకుడు రామసహాయం రఘురామ్ రెడ్డి (Khammam MP Ramasahayam Raghuram Reddy) కోసం ప్రచారం చేసారు

  • Written By:
  • Publish Date - May 9, 2024 / 05:38 PM IST

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు రాజకీయ పార్టీలన్నీ (Political Parties) సినీ గ్లామర్ (Cine Glamour) ను వాడుకోవాలని చూస్తాయి. సినీ తారలు ప్రచారం చేస్తే జనాల్లోకి తమ పార్టీ బాగా వెళ్తుందని..ఓటర్లు సైతం ఓటు వేస్తారని నమ్మకం. అందుకే ఎంత డబ్బు ఖర్చు పెట్టేయైన వారి చేత ప్రచారం చేయించుకోవాలని చూస్తారు. ఈసారి కూడా అలాగే చేయాలనీ అనుకున్నారు కానీ కుదరలేదు. ముఖ్యంగా ఏపీలో పవన్ (Pawan Kalyan) కోసం చిత్రసీమ మొత్తం కదిలివచ్చింది. మెగా ఫ్యామిలీ ఎలాగూ మద్దతు ఇస్తారని మాత్రమే అనుకున్నారు కానీ అగ్ర నిర్మాతలు , హీరోలు , క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు , జూ. ఆర్టిస్ట్ లు ..ఆఖరికి బుల్లితెర నటి నటులు సైతం పవన్ కళ్యాణ్ ను గెలిపించడంకోసం నడుం బిగించారు. పిఠాపురం , అనకాపల్లి తదితర ప్రాంతాలలో విస్తారంగా ప్రచారం చేసారు. అలాగే సోషల్ మీడియా వేదికగా కూడా తమ మద్దతును తెలియజేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈసారి సీనియర్ హీరో వెంకటేష్ (Venkatesh) కూడా ప్రచారం చేసారు. తెలంగాణ లో ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తన వియ్యంకుడు రామసహాయం రఘురామ్ రెడ్డి (Khammam MP Ramasahayam Raghuram Reddy) కోసం ప్రచారం చేసారు.ఖమ్మం సిటీ లో రోడ్ షో చేసి రామసహాయం రఘురామ్ రెడ్డిని గెలిపించాలని జై కాంగ్రెస్ అన్నారు..ఇక ఏపీలో ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి బిజెపి నాయకుడు కామినేని శ్రీనివాస్ (Kamineni Srinivas) తరఫున ఎన్నికల ప్రచారం చేసి జై బిజెపి అన్నారు. కామినేని శ్రీనివాస్ ఒక మంచి వ్యక్తని ఆయన ఏదైనా హామీ ఇస్తే నెరవేరుస్తారని చెప్పిన వెంకటేష్ వెంకీ మామగా, పెళ్ళికాని ప్రసాద్ గా అడుగుతున్నా.. కామినేని శ్రీనివాస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు . ఇలా రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలకు జై కొట్టడం తో అభిమానులు ఏంటి వెంకీ..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి వెంకీ పార్టీల కోసం ప్రచారం చేయలేదు. తనకు కావాల్సిన వ్యక్తుల కోసం ప్రచారం చేసారు. అందుకే ఎక్కడ కూడా ఇతర పార్టీల ఫై విమర్శలు , ఆరోపణలు చేయకుండా అభ్యర్థి పేరు చెప్పి ఓటు వేయాలని కోరారు. సో వెంకీ ప్రచారాన్ని రాజకీయంగా చూడొద్దు.

Read Also : AP Elections : వైఎస్సార్‌సీపీ కలలు బద్దలు కొట్టిన ఈసీ..!