Venkatesh Daughter Havyavahini : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వెంకటేష్ కూతురు – అల్లుడు

నేడు విఐపీ విరామ సమయంలో హయవాహిని, నిశాంత్ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించి, ఆశీస్సులు అందుకున్నారు

Published By: HashtagU Telugu Desk
Venkatesh Daughter Havyavah

Venkatesh Daughter Havyavah

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh)-నీరజ (Neeraja)ల రెండో కూతురు హవ్యవాహిని (Havyavahini) వివాహం రీసెంట్ గా రామానాయుడు స్టూడియో లో జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి (Wedding) అంటే ఎంత హడావిడి ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది సినీ ప్రముఖుల పెళ్లిళ్లు అంటే ఇక చెప్పాల్సిన పనిలేదు. టీవీ చానెల్స్ మొత్తం ఆ పెళ్లి వేడుకల్లోనే ఉంటాయి. పెళ్లి తంతు మొదలైన దగ్గరి నుండి..తిని అంత వెళ్లే వరకు ప్రతిదీ కవర్ చేస్తూ అభిమానులకు ఆనందాన్ని నింపుతూ…వారి TRP రేటింగ్ పెంచుకుంటాయి. ఇక ఇప్పుడు సోషల్ మీడియా హావ నడుస్తుండడం తో ఇంకాస్త కవరేజ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకరైన వెంకటేష్ కూతురు పెళ్లి తంతు మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా చాల సింపుల్ గా జరిగింది. అసలు ఈమె వివాహం జరిగిన సంగతి కూడా చాలామందికి తెలియదు. విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్ పాతూరిని హవ్యవాహిని పెళ్లి చేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక పెళ్లి తరువాత నూతన దంపతులు తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. నేడు విఐపీ విరామ సమయంలో హయవాహిని, నిశాంత్ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించి, ఆశీస్సులు అందుకున్నారు. ఇక కొత్త పెళ్లి కూతురు హయవాహిని ఎంతో సింపుల్ గా కనిపించింది. ఒక స్టార్ హీరో కూతురులా అస్సలు కనిపించలేదు. అస్సలు ఆమె ఎవరో కూడా అక్కడ చాలామందికి తెలియదు అన్నట్లే ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

Read Also : Sabja Seeds: సబ్జా గింజలే కదా అని లైట్ తీసుకుంటున్నారా.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో?

  Last Updated: 25 Mar 2024, 10:49 PM IST