Site icon HashtagU Telugu

Chiranjeevi : వెంకీ మామ చిరుకి ఫోన్ చేసి.. ఆ మూవీ నేను చేస్తే బాగుండేదని అన్నారట.. ఏ సినిమా?

Venkatesh call to Chiranjeevi and talk about Daddy Movie

Venkatesh call to Chiranjeevi and talk about Daddy Movie

ఇండస్ట్రీలో కొందరు హీరోలు ప్రయోగాలు చేసి కొన్ని సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తారు. ఇక రిలీజ్ అనంతరం ఆ చిత్రాలు చూసిన ఆడియన్స్.. ఈ మూవీ స్టోరీ ఈ హీరో కంటే ఆ హీరోకి బాగా సెట్ అయ్యేదని కామెంట్స్ చేస్తుంటారు. ఈ కామెంట్స్ ప్రేక్షకులు మాత్రమే కాదు. హీరోలు సైతం చేస్తుంటారు. ఇలా ఒకసారి విక్టరీ వెంకటేష్(Venkatesh), చిరంజీవికి(Chiranjeevi) ఫోన్ చేసి.. ఆ మూవీ మీకంటే నాకు బాగా సెట్ అయ్యేదని ముక్కుసూటిగా చెప్పేశారట.

ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ తో పాటు ఫ్రెండ్ ఎమోషన్ ని కూడా చూపించిన ‘డాడీ'(Daddy). 2001లో సురేశ్‌కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రశంసలు అందుకున్నా బాక్సాఫీస్‌ వద్ద కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ సినిమా కథ వినగానే మరో ఆలోచన లేకుండా చిరు ఇలా అన్నారట.. ‘ఈ మూవీ నాకంటే వెంకటేష్ కి బాగుంటుందని’ చెప్పారట. కానీ రచయిత భూపతి రాజా, పలువురు ఇండస్ట్రీ వ్యక్తులు.. “వెంకటేష్ చేస్తే పెద్ద కొత్తదనం ఉండదు. ఎందుకంటే ఆయన ఆ జోనర్ లో సినిమాలు చేశారు. మీరు ఈ కథని చేస్తే కొంచెం కొత్తగా ఉంటుంది” అని చెప్పి చిరంజీవిని కన్విన్స్‌ చేశారట.

 

ఇక బలవంతంగానే ఒప్పుకున్న చిరంజీవి.. ఆ సినిమా చేశారు. అయితే ఆ మూవీ రిజల్ట్ చిరంజీవి ఊహించినట్లే అయ్యింది. ఇక సినిమా చూసిన తరువాత వెంకటేష్, చిరంజీవికి ఫోన్ చేసి ఇలా అన్నారట.. ‘సినిమా బాగుందండి. కానీ మీకంటే నాకైతే బాగుండేది’ అని అన్నారట. ఆ మాటలకు చిరు బదులిస్తూ.. ‘నేను అదే చెప్పాను వెంకటేష్’ అంటూ జరిగిన విషయం చెప్పారట. ఒకవేళ డాడీ సినిమాని చిరంజీవి ఈ సమయంలో తీసి ఉంటే కచ్చితంగా విజయం సాధించేది. ప్రస్తుతం చిరు ఉన్న ఏజ్ కి ఆడియన్స్ ఈ కథని అంగీకరించే అవకాశం ఉంది. ఇటీవల రజినీకాంత్, కమల్ హాసన్.. జైలర్, విక్రమ్ సినిమాల్లో అలాంటి పాత్రని పోషించే హిట్ కొట్టారు.

 

Also Read : Kalyan Ram: ఎన్టీఆర్ దేవర గ్లింప్స్ పై కళ్యాణ్ రామ్ అదిరిపోయే అప్డేట్