Site icon HashtagU Telugu

Venkatesh : నిజమైన రాబందులను వెంకటేష్ మెడపై పెట్టి పొడిచేలా చేశారు.. ఏ సినిమాలో తెలుసా?

Real vultures stabbed venkatesh in his first movie kaliyuga pandavulu

Real vultures stabbed venkatesh in his first movie kaliyuga pandavulu

టాలీవుడ్(Tollywood) విక్టరీ వెంకటేష్(Venkatesh).. చంటి, రాజా, కలుసుందాం రా సినిమాలతో క్లాస్ ఆడియన్స్‌ని. అలాగే గణేష్, బొబ్బిలిరాజా, జయం మనదేరా, కూలీ నెంబర్ 1, తులసి వంటి సినిమాలతో మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ వచ్చాడు. ఇటీవల రానా నాయుడు(Rana Naidu) లో నటించి వెబ్ సిరీస్ ఇష్టపడే వారిని కూడా ఎంటర్టైన్ చేశాడు. ఇక ఈ సిరీస్ లో వెంకటేష్ ఇప్పటివరకు చేయని ఒక బోల్డ్ పాత్రలో కనిపించి అందర్నీ షాక్ కి గురి చేశాడు. అయితే కొంతమంది అభిమానులు మాత్రం వెంకీ మామని అలాంటి పాత్రలో ఉహించుకోలేకపోయారు.

ఒక సినిమాలో వెంకటేష్ మెడ పై నిజమైన రాబందులను పెట్టించి పొడిచేలా చేశారు మేకర్స్. అది కూడా వెంకటేష్ నటించిన ఫస్ట్ మూవీనే కావడం విశేషం. వెంకటేష్ ‘కలియుగ పాండవులు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించాడు. ఈ సినిమాలో వెంకటేష్ మొదట నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు. కాగా ఈ మూవీ క్లైమాక్స్ లో వెంకటేష్ అండ్ అతని ఫ్రెండ్స్ ని బంధించి రాబందులతో పొడిపించే సన్నివేశం ఉంది.

ఈ సీన్ కోసం నిజమైన రాబందులను తీసుకు వచ్చారు మేకర్స్. ఇక వాటిలో ఒకటి వెంకటేష్ పై పెట్టి కూడా పొడిపించారు. అయితే పొడిపించింది వెంకటేష్ ని కాదు. వెంకటేష్ వెనుక ఒక మాంసం ముక్క పెట్టారు. రాబందు ఆ మాంసం ముక్కని పొడిచి తింటున్న దృశ్యాన్ని కెమెరా మ్యాన్ వెంకటేష్ ని పొడిచినట్లు చిత్రీకరించాడు. అయితే ఈ సీన్ చిత్రీకరణ సమయంలో వెంకటేష్ కొంత భయపడ్డాట. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా కుష్బూ నటించింది. కుష్బూకి కూడా ఇది మొదటి సినిమానే. రావు గోపాల్ రావు విలన్ గా కనిపించరు. 1986లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది.

 

Also Read : RRR Movie : మరో అంతర్జాతీయ అవార్డు నామినేషన్స్ లో నిలిచిన RRR.. ఈ సారి సినిమా కాదు.. ట్రైలర్