Site icon HashtagU Telugu

Venkatesh : ముంబై లో వెంకీమామ సందడి..క్రికెటర్స్ తో సెల్ఫీలు

Venki Mumbai

Venki Mumbai

సినీ నటుడు వెంకటేష్ (Venkatesh) ముంబై (Mumbai) లో సందడి చేసాడు. వెంకటేష్ కు క్రికెట్ (Cricket) అంటే ఎంత ఇష్టమో చెప్పాల్సిన పనిలేదు. ఇండియా మ్యాచ్ లను చూసేందుకు స్వయంగా గ్రాండ్ కు వెళ్తుంటాడు. నిన్న ముంబై వేదిక గా జరిగిన ఇండియా ..న్యూజిలాండ్ (India vs New Zealand) సెమి ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వెంకీ అక్కడికి వెళ్లడమే కాదు..స్టార్ క్రికెటర్స్ తో సెల్ఫీ లు దిగి సందడి చేసాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ముందుగా విండీస్‌ క్రికెట్‌ దిగ్గజం వివ్ రిచర్డ్స్ తో సెల్ఫీ దిగిన వెంకీ..దానిని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ఇండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ లో క్రికెట్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్ ని కలవడం చాలా సంతోషంగా ఉంది’ అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌ సాకర్ దిగ్గజం బెక్‌ హమ్‌తో కలిసి మరో సెల్ఫీ దిగాడు వెంకటేష్‌. ‘గ్రేట్ ఇన్నింగ్స్ చూడటానికి గ్రేట్ కంపెనీ దొరికింది’ అంటూ పోస్ట్ చేసాడు. ఇక నిన్న జరిగిన సెమి ఫైనల్ లో టీమ్ ఇండియా ఘనవిజయం సాధించి ఫైనల్ కు చేరింది. ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈరోజు ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు..ఇండియా తో ఢీ కొట్టనున్నారు.

Read Also : AI In WhatsApp: వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్.. త్వరలోనే ఏఐ టూల్ లాంచ్..?