విక్టరీ వెంకటేష్ (Venkatesh) అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా సన్ర్కాంతికి వస్తున్నాం. సినిమా టైటిల్ లోనే సంక్రాంతికి వస్తున్నాం అని పెట్టి పొంగల్ రేసులో దిగుతున్నారు. ఐతే ఈ సినిమా విషయంలో ఏ ఒక్క విషయాన్ని వదలట్లేదు మేకర్స్. ముఖ్యంగా Sankranthiki Vastunnam సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో అనీల్ రావిపుడి మార్క్ చూపిస్తున్నారు. సినిమా నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ కాగా 3వ సాంగ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సాంగ్ ని వెంకటేష్ తో పాడించారు. దాని గురించి అప్డేట్ ఇస్తూ వెంకటేష్ నేను పాడతా అంటూ డైరెక్టర్ అనీల్ (Anil Ravipudi,) వెంట పడతాడు. ఆయనేమో హిందీ సింగర్స్ లేదా స్టార్ సింగర్స్ తో పాడించాలని అనుకుంటాడు. ఫైనల్ గా నేను పాడతా అంటూ వెంటపడుతున్న వెంకీకి ఛాన్స్ ఇస్తాడు. వెంకటేష్ తో సాంగ్ పాడించాం అన్నది డైరెక్ట్ గా చెప్పడం కామన్ కానీ ఇలా ప్రమోట్ చేసి చూపించడం వెరైటీగా ఉంది.
సో వెంకటేష్ లోని మరో టాలెంట్ ని చూపించబోతున్నారు. సాంగ్ ఏదో ముందు రెండు లైన్లు పాడటం కాదు ఈ సాంగ్ మొత్తం వెంకటేష్ పాడారని తెలుస్తుంది. సాంగ్ ప్రోమో రాలేదు కానీ ఈ సాంగ్ దగ్గుబాటి ఫ్యాన్స్ కే కాదు సంగీత ప్రియులను కూడా ఖుషి అయ్యేలా చేస్తుందని అంటున్నారు. మరి సంక్రాంతికి వస్తున్నా సాంగ్ ఎలా ఉండబోతుందో చూడాలి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు.