Site icon HashtagU Telugu

Venkatesh : సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ తోనే చెప్పేశారు..!

Venaktesh Anil Ravipudi movie shooting doing Silently

Venaktesh Anil Ravipudi movie shooting doing Silently

Venkatesh సంక్రాంతికి సైంధవ్ అంటూ వచ్చి నిరాశపరచిన విక్టరీ వెంకటేష్ తన నెక్స్ట్ సినిమా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపుడితో ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాతో అనీల్, వెంకటేష్ హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఎఫ్2, ఎఫ్ 3 సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఎమోషనల్ కంటెంట్ తో వస్తుందని తెలుస్తుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్ షిప్ స్టోరీగా ఈ సినిమా కథ ఉంటుందట.

ఈ సినిమాకు టైటిల్ గా సంక్రాంతికి వస్తున్నాం అని పెట్టబోతున్నారట. సినిమా టైటిలే వెరైటీగా అలా పెడుతున్నారంటే సినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ అని చెప్పకనే చెప్పారు. సినిమాలో వెంకటేష్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. మరోసారి ఈ సినిమా కోసం దేవి శ్రీ ప్రసాద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసినట్టు టాక్.

త్వరలోనే ఈ సినిమా ముహూర్తం పెట్టనున్నారట. వెంకటేష్ అనిల్ రావిపుడి ఈ కాంబో పై ఉన్న అంచనాలకు తగినట్టుగానే ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.