Site icon HashtagU Telugu

Venkatesh : వెంకీ మామ సినిమాలో నటించాలని అనుకుంటున్నారా.. అయితే ఈ అవకాశం..

Venkatesh Anil Ravipudi Movie Casting Call For Godavari Accent Artists

Venkatesh Anil Ravipudi Movie Casting Call For Godavari Accent Artists

Venkatesh : విక్టరీ వెంకటేష్ ఇటీవల తన 75వ ల్యాండ్ మార్క్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ మూవీ పరాజయాన్ని పక్కన పెట్టేసి.. వెంకీ మామ తన కొత్త సినిమా పై ఫోకస్ పెట్టారు. వెంకటేష్ తన నెక్స్ట్ మూవీని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబో నుంచి F2, F3 సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి.

ఇప్పుడు మూడోసారి మళ్ళీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. F2, F3 సినిమాల్లో వరుణ్ తేజ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకటేష్.. ఈ సినిమాలో మాత్రం సింగల్ గా నటించనున్నారు. కానీ ఇద్దరి హీరోయిన్స్ మధ్య నరినరీ నడుమ మురారి అనబోతున్నారు. ఈ సినిమాలో మాజీ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్న వెంకటేష్.. తన భార్య మరియు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య నలిగిపోయే పాత్రలో కనిపించబోతున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈక్రమంలోనే ఈ మూవీలో నటించే ఆర్టిస్టులు కోసం కాస్టింగ్ కాల్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. గోదావరి స్లాంగ్ మాట్లాడేవారు కావాలంటూ మేకర్స్ ఓ కాస్టింగ్ కాల్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. 6 నుంచి 14 ఏళ్ళు, 25 నుంచి 55 ఏళ్ళు వయసు ఉన్న మగవారు మరియు ఆడవాళ్లు కావాలంటూ తెలియజేసారు. ఇంటరెస్ట్ ఉన్నవారు VENKYANILO3@GMAIL.COM లేదా WHATSAPP: 8247812007 కి మీకు సంబంధించిన యాక్టింగ్ వీడియోలు పంపాలంటూ కోరారు. వీడియోలు అంటే.. ఇన్‌స్టా రీల్స్ పంపకూడదు.

మరి వెంకీ మామ సినిమాలో కనిపించే మంచి అవకాశాన్ని వదులుకోకండి. మీ దగ్గర టాలెంట్ ఉంటే.. వెంటనే మీ ప్రొఫైల్ ని షేర్ చేసేయండి. కాగా దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీ మీనాక్షి చౌదరి ఒక హీరోయిన్ గా నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Also read : Jai Hanuman : జై హనుమాన్ కొత్త పోస్టర్ చూసారా.. ఇదే ఈ రేంజ్‌లో ఉంటే.. ఇక మూవీ..