Venkatesh : వెంకటేష్ కోసం ఈసారి ఆ హీరోయిన్ ని దించుతున్నారా.. సూపర్ హిట్ కాంబో రిపీట్..!

Venkatesh విక్టరీ వెంకటేష్ సైంధవ్ తర్వాత చేస్తున్న సినిమా అనీల్ రావిపుడి డైరెక్షన్ లో వస్తుందని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారని తీసుకుంటున్నారని

Published By: HashtagU Telugu Desk
Venkatesh Sankranthiki Vastunnaam Business Details

Venkatesh Sankranthiki Vastunnaam Business Details

Venkatesh విక్టరీ వెంకటేష్ సైంధవ్ తర్వాత చేస్తున్న సినిమా అనీల్ రావిపుడి డైరెక్షన్ లో వస్తుందని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారని తీసుకుంటున్నారని తెలుస్తుంది. తమిళ్ లో లీడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న నయనతార అక్కడ కూడా స్టార్ సినిమాల్లో నటిస్తుంది. అయితే తన మొదటి ప్రియారిటీ మాత్రం సోలో సినిమాలకే ఇస్తుంది. అడపాదడపా కమర్షియల్ సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటిస్తుంది.

తెలుగులో అమ్మడు సీనియర్ స్టార్స్ అందరితో నటించింది. వెంకటేష్ తో ఆల్రెడీ 3 సినిమాలు చేసిన నయనతార 3 సినిమాలతో మంచి ఫలితాలనే అందుకుంది. ఇప్పుడు మరోసారి వెంకటేష్ సరసన నటిస్తుంది అమ్మడు. అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వెంకటేష్ చేస్తున్న హ్యాట్రిక్ సినిమాలో వెంకటేష్ తో నయనతార హీరోయిన్ గా నటిస్తుందట. సినిమా కోసం నయనతార భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తుంది.

వెంకటేష్ తో నయనతార ఇదివరకు లక్ష్మి, తులసి, బాబు బంగారం సినిమాల్లో నటించింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు. తప్పకుండా ఈ కాంబినేషన్ ఫ్యాన్స్ ని అలరిస్తుందని చెప్పొచ్చు. వెంకటేష్ తో నయనతార నటిస్తుందని తెలిసి నయన్ తెలుగు ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు.

అనీల్ రావిపుడితో f2, f3 సినిమాలు చేసిన వెంకటేష్ ఆ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి వెరైటీ కథతో వస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్ షిప్ సాక్రిఫైజ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా కథ ఉంటుందని తెలుస్తుంది. మరి సినిమాకు సంబందించిన పూర్తి డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది.

Also Read : OTT Releases : రేపు OTT లో ఒకటి , రెండు కాదు 10 సినిమాలు వచ్చేస్తున్నాయి..

  Last Updated: 09 Feb 2024, 08:00 AM IST