Venkatesh 76 : వెంకటేష్ 76 అప్డేట్.. దగ్గుబాటి ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ..!

Venkatesh 76 విక్టరీ వెంకటేష్ సైంధవ్ తర్వాత చేస్తున్న సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ ఈ కాంబోలో F2, F3 సినిమాలు వచ్చాయి. రెండు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ల

Published By: HashtagU Telugu Desk
Venkatesh Sankranthiki Vastunnaam Business Details

Venkatesh Sankranthiki Vastunnaam Business Details

Venkatesh 76 విక్టరీ వెంకటేష్ సైంధవ్ తర్వాత చేస్తున్న సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ ఈ కాంబోలో F2, F3 సినిమాలు వచ్చాయి. రెండు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ల తర్వాత వెంకటేష్ అనిల్ థర్డ్ సూపర్ హిట్ కోసం కలిసి పనిచేస్తున్నారు. హీరో డైరెక్టర్ మాత్రమే కాదు నిర్మాత కూడా ఈ హ్యాట్రిక్ సినిమాలో భాగం అవుతున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమా కు సంబందించిన ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రానుంది. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా జూన్ ఎండింగ్ లేదా జూలై స్టార్టింగ్ లో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించబోతుందని టాక్. అయితే త్రిష కాదు మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని చెప్పుకుంటున్నారు.

సినిమా సెట్స్ మీదకు వెళ్తే కానీ హీరోయిన్ పై క్లారిటీ వస్తుంది. సైంధవ్ తో డిజాస్టర్ ఫేస్ చేసిన వెంకటేష్ వెంటనే హిట్ కొట్టాలని కసి మీద ఉన్నాడు. వెంకటేష్ అనిల్ థర్డ్ మూవీ హ్యాట్రిక్ హిట్ అయ్యేలా చేస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాలో వెంకటేష్ ఫ్రెండ్ రోల్ లో మరో హీరో సర్ ప్రైజ్ రోల్ లో నటిస్తాడని టాక్. ఆ హీరో ఎవరన్నది కూడా త్వరలో తెలుస్తుంది.

  Last Updated: 23 Mar 2024, 02:44 PM IST