Venaktesh : వెంకటేష్ సినిమా సీక్రెట్ గా చేస్తున్నారా..?

Venaktesh విక్టరీ వెంకటేష్ సైంధవ్ తో షాక్ తిన్నారు. శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కిన సైంధవ్ సినిమా ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా విఫలమైంది.

Published By: HashtagU Telugu Desk
Venaktesh Anil Ravipudi movie shooting doing Silently

Venaktesh Anil Ravipudi movie shooting doing Silently

Venaktesh విక్టరీ వెంకటేష్ సైంధవ్ తో షాక్ తిన్నారు. శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కిన సైంధవ్ సినిమా ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా విఫలమైంది. ఐతే ఈ సినిమా తర్వాత రిస్క్ లేకుండా అనీల్ రావిపుడితో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు వెంకటేష్. విక్టరీ వెంకటేష్ లీడ్ రోల్ లో అనీల్ రావిపుడి డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారని తెలుస్తుంది. ఐతే సినిమా గురించి రకరకాల వార్తలు వస్తున్నా మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు.

మరోపక్క ఈ సినిమా ఆల్రెడీ మొదలైందని సినిమా షూటింగ్ సీక్రెట్ గా జరుగుతుందని అంటున్నారు. వెంకటేష్ సినిమా ఇంత సైలెంట్ గా షూట్ చేయడం ఏంటని ఫ్యాన్స్ డౌట్ పడుతున్నారు. అనీల్ రావిపుడితో ఆల్రెడీ ఎఫ్2, ఎఫ్3 సినిమాలు చేసిన వెంకటేష్ ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఈ సినిమా మాత్రం అటు ఎంటర్టైన్ అందిస్తూనే ఎమోషనల్ సినిమాగా ఉంటుందని తెలుస్తుంది.

వెంకటేష్ 76వ సినిమాగా ఇది వస్తుంది. ఐతే ఆ తర్వాత సినిమా తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో చేయాలని చూస్తున్నారు. తరుణ్ భాస్కర్ తో వెంకటేష్ సినిమా దాదాపు 3, 4 ఏళ్లుగా చర్చల్లో ఉంది. కానీ ఎందుకో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లట్లేదు. మరి ఈసారైనా తరుణ్ భాస్కర్ సినిమా మొదలవుతుందా లేదా అన్నది చూడాలి.

Also Read : Rajamaouli : రాజమౌళి స్పీడ్ పెంచాల్సిందే..!

  Last Updated: 03 Jul 2024, 09:37 AM IST