Pawan Kalyan : డబ్బింగ్ చెప్పడంలో వీరమల్లు సరికొత్త రికార్డు

Pawan Kalyan : రాత్రి 10 గంటల వరకూ ఓజీ షూటింగ్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్, అదే రాత్రి డబ్బింగ్ స్టూడియోకు చేరుకుని డబ్బింగ్ పూర్తి చేశారు

Published By: HashtagU Telugu Desk
Pawan Dubbing

Pawan Dubbing

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓ పక్క బాధ్యతలు నిర్వహిస్తూ, అదే సమయంలో తన సినిమాలకు (Movies) సంబదించిన పనులను పూర్తి చేస్తూ తన డెడికేషన్‌ను నిరూపించుకుంటున్నారు. తాజాగా హరిహర వీర మల్లు (Hari Hara Veera Mallu) సినిమా డబ్బింగ్‌ను కేవలం నాలుగు గంటల్లో పూర్తి చేయడం సరికొత్త రికార్డు గా మారింది. రాత్రి 10 గంటల వరకూ ఓజీ షూటింగ్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్, అదే రాత్రి డబ్బింగ్ స్టూడియోకు చేరుకుని డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకోగా, నెటిజన్లు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.

Telangana New Ministers : తెలంగాణ కొత్త మంత్రులు వీరేనా..?

సినిమా పట్ల పవన్ కళ్యాణ్ చూపుతున్న కమిట్‌మెంట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పూర్తిగా గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలో ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది. హరిహర వీర మల్లు సినిమా కథ, విజువల్ ప్రెజెంటేషన్ దృష్ట్యా గ్రాండ్ సినిమాటిక్ అనుభూతిని అందించడానికి డిజైన్ చేశారు. థియేటర్ల విడుదల అనంతరం, ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

  Last Updated: 30 May 2025, 07:22 PM IST