పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక చారిత్రక చిత్రం హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) ఈ నెల 24న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఫ్యాన్స్ మధ్య భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమా ప్రీ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల కోసం పోటీ నెలకొని ఉండటంతో ప్రీమియర్ షోలతో పాటు తొలి రోజు మల్టిపుల్ షోల కోసం ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు. సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న నేపథ్యంలో అందరికీ టికెట్ దక్కాలన్న ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే హైదరాబాద్ లోని ప్రముఖ సంధ్య థియేటర్(Sandhya 70mm)లో మాత్రం ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా పెద్ద సినిమాలకు ఐదు షోలు వేసే ఈ థియేటర్, హరిహర వీరమల్లు కోసం కేవలం రెండు షోలకే బుకింగ్ ప్రారంభించింది. మధ్యాహ్నం 2:30 గంటల షో, సాయంత్రం 6 గంటల షోలకే టికెట్లు చూపిస్తుండటంతో మార్నింగ్ షోలు, ప్రీమియర్ షోలు రద్దయ్యాయా అనే సందేహాలు ఏర్పడ్డాయి. ఫుల్ బుకింగ్‌గా చూపిస్తూ, మిగతా షోలు లేకపోవడం ఫ్యాన్స్‌లో అసంతృప్తి రేపుతోంది.
Roja : అసలు రోజా ఆడదో.. మగదో అర్ధం కావడం లేదు – జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
దీనికి కారణం పుష్ప 2 ట్రైలర్ ప్రదర్శన సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద ఏర్పడిన తొక్కిసలాటతో పోలీసులు అప్రమత్తమయ్యారని సమాచారం. అదే ప్రమాదం మరోసారి జరగకూడదని, భద్రతా కారణాల దృష్ట్యా మార్నింగ్, ప్రీమియర్ షోలు రద్దు చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల సూచనలతో థియేటర్ యాజమాన్యం ముందస్తుగా షోలను పరిమితం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హరిహర వీరమల్లు ట్రైలర్‌ను కూడా ఇప్పటివరకు ఈ థియేటర్‌లో ప్రదర్శించకపోవడమే దీనికి మద్దతుగా నిలుస్తోంది. మరి నిజంగా అదే కారణమా..? లేక వేరేనా..? లేక మొదటి రెండు షో లకు సంబందించిన టికెట్స్ థియేటర్స్ వద్దే ఇస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.