విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)కు ఇది చావో రేవో టైమ్. కొంతకాలంగా సరైన హిట్ లేక స్ట్రగుల్ అవుతున్న విజయ్, ఇప్పుడు “కింగ్‌డమ్” (Kingdom) సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 30న థియేటర్లలోకి రానుందని అధికారికంగా ప్రకటించడంతో ప్రమోషన్లు కూడా జోరుగా సాగుతున్నాయి. అయితే ఇంతలోనే పవన్ కళ్యాణ్ నటిస్తున్న “హరిహర వీరమల్లు” (Harihara Veeramallu) చిత్రం అదే తేదీన విడుదల కావచ్చనే వార్తలు “కింగ్‌డమ్” టీంకి టెన్షన్ పెడుతున్నాయి.
పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న “హరిహర వీరమల్లు” సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి అనేక వాయిదాలకు గురవుతూ వస్తోంది. మొదట మార్చిలో, తర్వాత మే 9న విడుదల చేయాలన్న యత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడు మేకర్స్ మే 30ని టార్గెట్ చేస్తున్నట్లు టాక్. అయితే షూటింగ్ ఇంకా పూర్తికాలేదు, వీఎఫ్ఎక్స్ పనులు కొనసాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇటీవలే మళ్లీ సెట్‌లోకి అడుగుపెట్టడంతో ఈ సినిమా మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. అమెజాన్ ప్రైమ్ కూడా ఓటీటీ విడుదలపై ఒత్తిడి చేస్తుండడంతో, మేకర్స్ జూన్ రెండో వారానికైనా రిలీజ్ ప్లాన్ చేయాలని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో “కింగ్‌డమ్” మేకర్స్ అసలు తమ సినిమాని మే 30న రిలీజ్ చేయాలా లేక వాయిదా వేయాలా అనే సందిగ్ధం లో ఉన్నారు. మరి వీరమల్లు సైడ్ ఇస్తాడా..? లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.