మలినేని గోపిచంద్ దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలయ్య (Balakrishna) నటించిన వీరసింహారెడ్డి (Veera Simha Reddy) మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలయ్య సినిమాతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ కళకళలాడుతున్నాయి. అఖండ తర్వాత నందమూరి బాలకృష్ణ మరో ద్విపాత్రాభినయంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా చూసేందుకు బాలయ్య ఫాన్స్ ఎగబడటంతో థియేటర్స్ సందడిగా కనిపించాయి. అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ కోసం పలు ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
కాగా (Veera Simha Reddy) సినిమా విడుదలైన 45 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా.. తమన్ (Thaman) సంగీతం అందించారు. సినిమాలోని పాటలన్నీ హిట్ అవడంతో చార్ట్ బస్టర్ ఆల్బమ్‌గా నిలిచింది. మూవీపై విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యేందుకు ఇది కూడా ఒక కారణం. కన్నడ నటుడు దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే బాలయ్య ఫ్యాన్స్ తో కలిసి వీరసింహారెడ్డి సినిమాను తిలకించారు.
Also Read: Ayyappa Swamy Prasadam: కేరళ అయ్యప్ప స్వామి ప్రసాదం నిలిపివేత!